రాయలసీమకు వ్యతిరేకంగా శక్తులను ప్రభావితం చేస్తున్న ఉన్మాదం; చంద్రబాబు ఎప్పటికీ చరిత్రహీనుడే : సాయిరెడ్డి ధ్వజం
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంటున్న జల వివాదాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడే ప్రస్తుత వివాదాలకు కారణమని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి.

సీమ ప్రజలు శాశ్వతంగా కరువు కోరల నుండి బయటపడాలని ఆకాంక్ష చంద్రబాబుకు లేదు
రాయలసీమ ఎత్తిపోతల పథకం ముందుకు సాగకుండా రకరకాల శక్తులను ప్రభావితం చేస్తున్నది చంద్రబాబునే అంటూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజలు శాశ్వతంగా కరువు కోరల నుండి బయటపడాలని ఆకాంక్ష చంద్రబాబుకు అసలు లేదని, చంద్రబాబు రెండు పనులు లక్ష్యంగా పెట్టుకున్నారని మొదటిది జగన్ గారికి పేరు రాకూడదని, ఇక రెండవది తనను ఓడించిన ప్రజలకు మేలు జరగకూడదనే ఉన్మాదం చంద్రబాబును నిలువునా ఆవహించింది అని విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.

చంద్రబాబు ఎప్పటికీ చరిత్రహీనుడిగా మిగిలిపోతారు
అంతేకాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు సంబంధించి చంద్రబాబు ఎప్పటికీ చరిత్రహీనుడిగా మిగిలిపోతారు అంటూ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. మహానేత వైయస్ఆర్ అనుమతులు తెచ్చి మొదలు పెట్టిన వాటిని కూడా అడుగు ముందుకు తీసుకోలేదు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం అంచనాలు పెంచడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యవసాయమే దండగన్న వ్యక్తి ఆ పరిధిని దాటి ఆలోచించలేడు అంటూ విజయ సాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట ఉన్న పార్టీ ఆఫీసులు అన్నీ బాబు కుటుంబ అధీనంలోనే
ఇదే సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట ఉన్న పార్టీ ఆఫీసులు అన్నీ బాబు కుటుంబం అధీనంలోనే ఉన్నాయని లీజుకు తీసుకున్న స్థలాలలో ఆక్రమించుకున్న భూములలో నిర్మించిన ఈ భారీ భవనాలు వాటికి సరైన అనుమతులు కూడా లేవని విజయసాయి రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్న పార్టీ ఆఫీసులను టార్గెట్ చేశారు. వీటి విలువ వందలకోట్లలో ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తు జరిపితే బండారం మొత్తం బయట పడుతుందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ఆఫీసుల్లో ప్రైవేట్ కాల్ సెంటర్లు, హోటళ్లు ,లాడ్జీలు నడుపుతావా చంద్రబాబు
ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో ఉన్న టీడీపీ ఆఫీసులను టార్గెట్ చేసిన విజయసాయి ఎన్టీఆర్ భవన్లో ఏం వ్యాపారాలు చేస్తున్నావు చంద్రబాబు. ప్రైవేట్ కాల్ సెంటర్లు, హోటళ్లు ,లాడ్జీలు నడుపుతావా అందుకేనా కరకట్ట కొంప వదిలి హైదరాబాద్లో మకాం వేశారు. ట్రస్టు పేరుతో లీజుకు తీసుకుని ఎన్టీఆర్ కే కాదు ఆయన ఆశయాలకు పార్టీ కి కూడా వెన్నుపోటు పొడుస్తున్నావు అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు.
గతంలో చంద్రబాబు కంప్యూటర్ సెల్ ఫోన్ కనిపెట్టినానని చెప్పుకున్నాడు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తన వల్లే అంటున్నాడు. ఆసుపత్రిలో చేర్చకుండా చంద్రబాబును అలాగే వదిలేస్తే కరోనా సెకండ్ వేవ్ కూడా తన వల్లే వచ్చింది అంటాడు . అలాగే వదిలేస్తే ప్రపంచం మీదకు కరోనా వైరస్ ను వదిలింది కూడా తానే అంటాడు. టీడీపీ తమ్ముళ్ళు జాగ్రత్త అంటూ చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రోగానికి మందు ఉంటుంది కానీ పచ్చ రోగానికి మందు లేదు
ఇక దిశ యాప్ ను లక్షలాది అక్కా చెల్లెమ్మలు డౌన్లోడ్ చేసుకుంటూ తమకు అన్న తోడుగా వచ్చాడు అని భావిస్తూ ఉంటే యాప్ లో రంగులు వైసిపివంటూ పచ్చ మీడియా ఏడుపు మొదలు పెట్టిందని విమర్శించారు. రేపు జాతీయ జెండాలోని వైసిపి రంగులు ఉన్నాయని గింజుకుంటుందేమో!! రోగానికి మందు ఉంటుంది కానీ ఈ పచ్చ మాయ రోగానికి మందు లేదు అంటూ విజయ సాయి రెడ్డి వైసిపి రంగులు ఉన్నాయని చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications