ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు - అమెరికా సర్వర్‌లో ఓటర్ల డేటా..!!

విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్‌వెవల్‌ అధికారులపై టీడీపి నేతలు దాడులు చేస్తున్నారనివైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులను బీఎల్‌ఓలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని కూడా తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వారి ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు.

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘంను కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. అమెరికా సర్వర్‌లో ఓటర్ల డేటా స్టోర్‌ చేస్తున్నారని వివరించారు. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని ఫిర్యాదు చేసారు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్‌ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారని చెప్పుకొచ్చారు.

YSRCP MPs Complains On TDP To CEC Over Fake Voters in the state

పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశామని సాయిరెడ్డి వెల్లడించారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరామననారు. సీఈసీ కూడా తమ విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించిందన్నారు. టీడీపీ నేతలు 40లక్షల 76 వేల 580 ఓట్లను ఒకే ఫొటోతో ఇంటి పేరు​ మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్లు ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్లుగా టీడీపీ సానుభుతిపరుల పేరు నమోదు చేశారని.. హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు, ఒడిషాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని తెలిపారు.

ఈ దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్‌వెవల్‌ అధికారులపై టీడీపి నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైఎ‍స్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులను బీఎల్‌ఓలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని కూడా తెలియజేశారు. విచారణ సమయంలో నిజాలు వెలుగు చూస్తుండడంతో బీఎల్ఓలను టీడీపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+