వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా పోరాటం: వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష ప్రారంభం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దీక్ష ప్రారంభమైంది.

లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన అనంతరం వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు సంఘిభావం తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

ysrcp mps indefinite hunger strike begins ap bhavan

ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినాదాలు చేశారు. కాగా, దీక్షలో కూర్చోవడానికి ముందు.. ఏపీ భవన్‌ ప్రాంగణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఆ తర్వాత.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పించిన ఐదుగురు అమరుల చిత్రపటాలపై పూలుచల్లి నివాళులు అర్పించారు.

English summary
YSRCP MPs indefinite hunger strike begins ap bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X