వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పినట్టే..పార్లమెంట్‌ను స్తంభింపజేసిన వైసీపీ: మోడీ చూస్తుండగానే..పోడియం చుట్టూ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దాన్ని కార్యాచరణలోకి తెచ్చింది. చెప్పినట్టే- వైసీపీ సభ్యులు పార్లమెంట్‌ను స్తంభింపజేశారు. రాజ్యసభలో ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. రాజ్యసభలో వైసీపీ సభాపక్ష నేత వీ విజయసాయి రెడ్డి దీనికి సారథ్యం వహించారు. ప్రత్యేక హోదాపై సభలో చర్చించాలని కోరుతూ ఈ ఉదయం ఆయన రాజ్యసభ రూల్‌ 267 కింద ఛైర్మన్ వెంకయ్యనాయుడికి నోటీసు ఇచ్చారు.

బంగాళాఖాతంలో జంట అల్పపీడనాలు: వారం రోజుల గ్యాప్‌లో: ఎడాపెడా కుమ్మేసేలాబంగాళాఖాతంలో జంట అల్పపీడనాలు: వారం రోజుల గ్యాప్‌లో: ఎడాపెడా కుమ్మేసేలా

నిండు సభలో ఇచ్చిన హామీకి ఏడేళ్లు..

నిండు సభలో ఇచ్చిన హామీకి ఏడేళ్లు..

సభ సమావేశమైన తరువాత.. విజయసాయిరెడ్డి ఈ నోటీసు గురంచి ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై సభలో వెంటనే చర్చించాలని కోరారు. రాజ్యసభ బిజినెస్‌ను వాయిదా వేసి.. తొలుత ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించడానికి అవసరమైన కారణాలపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్.. రాష్ట్రానికి పలు హామీలను ప్రకటించారని గుర్తుచేశారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామనే ప్రధాన హామీ ఇచ్చారని చెప్పారు.

పుదుచ్చేరికి హోదా హామీ..

పుదుచ్చేరికి హోదా హామీ..

ఏడేళ్ళయినప్పటికీ.. ఈ హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని గుర్తు చేశారు. సభా వ్యవహారాలన్నింటినీ సస్పెండ్‌ చేసి, వెంటనే హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం చట్టానికి అతీతంగా వ్యవహరిస్తోందని, సాక్షాత్తూ నిండు పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని విస్మరిస్తోందని విమర్శించారు. రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిని అనుసరిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన ఎన్నిక మేనిఫెస్టోలో పొందుపరిచిందని, ఎవ్వరూ డిమాండ్ చేయకున్నా కేంద్రం సానుకూలంగా వ్యవహరించిందని అన్నారు.

వెల్‌లోకి దూసుకెళ్లిన వైసీపీ

వెల్‌లోకి దూసుకెళ్లిన వైసీపీ

ఏపీ విషయంలోమాత్రం సవతితల్లి ప్రేమను కేంద్ర ప్రదర్శిస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఆర్థిక సంఘం పేరు చెప్పి జాప్యం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. 267వ రూల్ కింద తక్షణమే తాను ఇచ్చిన నోటీసుపై చర్చించాలని డిమాండ్ చేశారు వైసీపీ సభ్యులు. దీనికి ఛైర్మన్ అంగీకరించకపోవడంతో వెల్‌లోకి దూసుకెళ్లారు. పోడియం చుట్టుముట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలోనే ఉన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ.. నిధులను మాత్రం సకాలంలో విడుదల చేయట్లేదని పేర్కొన్నారు.

వారించిన ఛైర్మన్

ఛైర్మన్ వారిని వారించారు. సభను డిక్టేట్ చేయాలనుకోవడం అవివేకమని సున్నితంగా మందలించారు. రూల్ 267 కింద ఇచ్చిన నోటీసు తనకు అందిందని, సభ్యులు కోరిన విధంగా ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా అంశంపై చర్చకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దానికి సరైన సమయం వస్తుందని అన్నారు. సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని, ఎవరి స్థానాల్లో వారు వెళ్లి కూర్చోవాలని సూచించారు. ప్రత్యేక హోదాపై సరైన సమయంలో చర్చించడానికి అనుమతి ఇస్తానని భరోసా ఇచ్చారు.

English summary
Members of the YSR Congress Party, ruling party in Andhra Pradesh have steel the Rajya Sabha on Special Status for the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X