‘చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు విసిరేందుకు వారికి రూ. 500లేనా?’(వీడియో)

అమరావతి: విశాఖపట్నంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ను వైసీపీ కార్యకర్తలు, ప్రజలు అడ్డుకున్న విషయం విషయం తెలిసిందే. దీంతో ఆయన విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. అయితే, చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Recommended Video

    Go Back Chandrababu : Paying People 500/- To Throw Eggs & Tomatoes On Chandrababu | Oneindia Telugu

    రూ. 500 ఇచ్చి తీసుకొచ్చి..


    ‘జగన్ నీచబుద్ది మరొకసారి బయటపడింది.. చంద్రబాబుపై టమాటాలు గుడ్లు విసరటానికి మనిషికి 500 ఇచ్చి తీసుకొచ్చిన పేటీయం బ్యాచ్ చంద్రబాబుకు వైజాగ్లో ప్రజల మద్దతు లభిస్తుందనే భయంతోనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు జగన్' అని ఓ టీడీపీ అభిమాన నెటిజన్ ట్విట్టర్ వేదికగా వీడియోను పోస్టు చేశారు.

    వైసీపీ పైశాచికత్వం..

    ‘ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిని రాష్ట్రంలో తిరగనీయకుండా కిరాయి మూకలను, గూండాలను రంగంలో దించిన పాలకుల పైశాచిక ప్రవృత్తిని ఈరోజు దేశమంతా చూస్తోంది. ఇందుకు నిరసనగా విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద తెలుగుదేశం నేతలతో చంద్రబాబు బైఠాయించిన దృశ్యాలివి' అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

    జగన్‌ను శపిస్తున్నారంటూ..

    ‘ఫుడ్ కూడా పెట్టలేదు మాకు, ఒక గంట అని చెప్పారు, కానీ ఇక్కడ మా వాళ్ళు మంచినీళ్లు కూడా ఇవ్వడంలేదు.. ఇదేం ఖర్మ మాకు అని జగన్ ను శపిస్తున్న వైసీపీ కార్యకర్తలు' అంటూ మరో వీడియోను టీడీపీ తన ఖాతాలో పోస్టు చేసింది.

    వైసీపీ గుండెల్లో రైళ్లు.. అందుకే రైడీ మూకలు..

    ‘చంద్రబాబు విశాఖకు వస్తున్నారనగానే... రాజధాని ముసుగులో విశాఖలో పులివెందుల గ్యాంగులు చేస్తున్న దారుణాలు బయటపడతాన్న భయంతో వైసీపీ గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. అందుకే చంద్రబాబు పర్యటనను అడ్డుకోడానికి కిరాయి రౌడీమూకలను రంగంలోకి దించి విధ్వంసం సృష్టించింది వైసీపీ ప్రభుత్వం' అని టీడీపీ ఆరోపించింది.

    విశాఖలో పులివెందుల దొంగలముఠా.. పోలీసులు చోద్యం..

    ‘ప్రశాంత విశాఖలో, చెప్పింది చేసిన వైసీపీ పులివెందుల దొంగల ముఠా. చంద్రబాబుగారి పర్యటన నేపథ్యంలో, విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ మూకలు వీరంగం సృష్టించాయి. అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు.
    రాళ్ళు విసురుతూ చంద్రబాబుగారిని గాయపరిచే ప్రయత్నం చేస్తున్న వైసీపీ గుండాలు.. తమ చర్యలను చిత్రీకరిస్తున్న మీడియా పై కూడా దాడి చేసారు. ఎమ్మెల్యే రామకృష్ణ బాబు కారు పగలకొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఎందుకున్నారు? తాడేపల్లి ఇంటి నుంచి వస్తున్న ఆదేశాలు కారణమా?'

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+