వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి ఎంపీ మిథున్‌రెడ్డి: బాలకృష్ణకు చెక్ పెట్టేనా, వైసీపీ ప్లాన్ ఇదే!

2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపనుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Hindupur Assembly seat in 2019 elections : బాలకృష్ణకు చెక్

అనంతపురం: 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపనుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం టిడిపికి కంచుకొటగా ఉంది. అయితే ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా మరోసారి నందమూరి బాలకృష్ణ పోటీ చేయనున్నారు. అయితే వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన నవీన్ నిశ్చల్‌ను మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అవగాహన లేకుండా పరువు తీయొద్దు, బాబు హుందాగానే: లోకేష్‌పై తమ్మారెడ్డి సంచలనంఅవగాహన లేకుండా పరువు తీయొద్దు, బాబు హుందాగానే: లోకేష్‌పై తమ్మారెడ్డి సంచలనం

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీ చేసి విజయం సాధించారు. బాలకృష్ణకు పోటీగా వైసీపీ అభ్యర్థిగా నవీన్ నిశ్చల్ పోటీ చేశారు.

హైద్రాబాద్‌లో కూర్చొని విమర్శలా, ఏపీలో ఆధార్, ఓటరు కార్డుల్లేవ్: లోకేష్ సంచలనంహైద్రాబాద్‌లో కూర్చొని విమర్శలా, ఏపీలో ఆధార్, ఓటరు కార్డుల్లేవ్: లోకేష్ సంచలనం

నవీన్ నిశ్చల్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నవీన్ నిశ్చల్ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైసీపీ కూడ టిడిపికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.

కులాన్ని అంటగడుతారా, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే, జ్యూరీ నిర్ణయమే: బాబు సంచలనంకులాన్ని అంటగడుతారా, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే, జ్యూరీ నిర్ణయమే: బాబు సంచలనం

లోకేష్‌పై రెచ్చిన పోసాని: నంది అవార్డు తీసుకోను, కెసిఆర్‌ను చూసి, విమర్శించొద్దా? లోకేష్‌పై రెచ్చిన పోసాని: నంది అవార్డు తీసుకోను, కెసిఆర్‌ను చూసి, విమర్శించొద్దా?

బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ ప్లాన్

బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ ప్లాన్

ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపురం నియోజకర్గంలో మంచి పట్టుంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్టీఆర్ గతంలో ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత నందమూరి హరికృష్ణ కూడ ఈ స్థానం నుండి విజయం సాధించారు. 2014 ఎన్నికల సమయంలో బాలకృష్ణ ఈ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. అయితే బాలకృష్ణను హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు సామాజిక సమీకరణాల ఆధారంగా టిడిపికి చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది.హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణను ఓడించడం ద్వారా టిడిపికి షాకివ్వాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

 వాల్మీకి సామాజిక వర్గం నేతలను బరిలోకి

వాల్మీకి సామాజిక వర్గం నేతలను బరిలోకి

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నవీన్ నిశ్చల్ బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వాల్మీకి బోయ సామాజిక వర్గం గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన నేతను 2019 ఎన్నికల్లో హిందూపురం నుండి బరిలోకి దింపాలని వైసీపీ నాయకత్వం ప్లాన్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. అయితే వాల్మీకి బోయ సామాజికవర్గానికి చెందిన నేత కోసం వైసీపీ ప్లాన్ అన్వేషణ సాగిస్తోందంటున్నారు.

 చక్రం తిప్పుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి

చక్రం తిప్పుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీ నటుడు బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. టిడిపిలో వాల్మీకీ బోయ సామాజిక వర్గానికి చెందిన నేతను వైసీపీలో చేర్పించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని మిథున్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే వైసీపీ నేతలు ఆ టిడిపి నేతతో సంప్రదింపులు జరిపారా, జరిపితే అక్కడి నుండి ఎలాంటి స్పందన వచ్చింది. వైసీపీ ఎలా స్పందిస్తోందనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

 నవీన్ నిశ్చల్ పయనమెటు

నవీన్ నిశ్చల్ పయనమెటు

2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు దక్కకపోతే నవీన్ నిశ్చల్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే సామాజిక సమీకరణాలు కూడ గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున నవీన్ నిశ్చల్‌ స్థానంలో వాల్మీకి బోయ సామాజిక వర్గం అభ్యర్థిని బరిలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోందని ప్రచారం. అదే జరిగితే నవీన్ నిశ్చల్ వైసీపీలోనే కొనసాగుతారా... లేదా అనేది కూడ ఆసక్తికరంగా మారింది. అయితే నవీన్ నిశ్చల్ జనసేనలోకి కూడ వెళ్ళే అవకాశాలను కొట్ఠిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Ysrcp planning to win Hindupur Assembly seat in 2019 elections.Ysrcp searching for Boya caste candidate to contest from Hindupur segment.in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X