కీలక నిర్ణయం తీసుకున్న జగన్
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.దీంతో ప్రభుత్వ నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు మద్దతుగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫీజుపోరు నిర్వహించాలని నిర్ణయించింది.
అయితే తాజాగా ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. తొలుత ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఫీజు పోరు కార్యక్రమం చేపట్టాలని జగన్ నిర్ణయించారు.ఆ మేరకు వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని ఉదృతంగా చేపట్టాలని పార్టీ భావించింది. దీనికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది.

ఫీజు పోరు నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా పార్టీ నాయకులు విడుదల చేశారు. అయితే పలు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఫిబ్రవరి 5న జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తమ ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఆదివారమే ఎన్నికల సంఘాన్ని వైసీపీ కోరింది. అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications