అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు మెడకు సీబీఐ ఉచ్చు.. లోక్‌సభలో వైసీపీ కీలక ప్రతిపాదన.. కేంద్రం గ్రీన్ సిగ్నల్?

|
Google Oneindia TeluguNews

అమరావతికి సంబంధించిన వ్యవహారాలపై ఢిల్లీ కేంద్రంగా సోమవారం జరిగిన పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకునేలా సీఎం జగన్ పన్నిన వ్యూహాలు ఒక్కొక్కటిగా అమలవుతుండటం టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేయనున్నట్లు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించిన కొద్ది గంటలకే.. సీబీఐ దర్యాప్తు అంశం కూడా చర్చకొచ్చింది. ఈ మేరకు లోక్ సభలో వైసీపీ ఎంపీలు చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించే అవకాశాలున్నట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..


చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూఅక్రమాలు జరిగాయని వాదిస్తోన్న వైసీపీ.. ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించడం.. 780 మంది తెల్ల రేషన్ కార్డుదారులు అమరావతిలో కోట్ల విలువైన భూములు కొన్నట్లు దర్యాప్తులో తేలడం విదితమే. దీనిపై ఈడీ కూడా విచారణ చేయబోతున్నట్లు సోమవారం ఉదయం ప్రకటన రాగా, సాయంత్రం లోక్ సభలో వైసీపీ ఎంపీలు మళ్లీ అదే అంశాన్నిలేవనెత్తారు.

చాలా పెద్ద స్కాం.. సీబీఐనే కావాలి

చాలా పెద్ద స్కాం.. సీబీఐనే కావాలి

లోక్ సభలో వైసీపీ పక్షనేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. అమరావతిలో భూకొనుగోళ్ల వ్యవహారం చాలా పెద్ద కుంభకోణమని, సీఐడీ ఎంక్వైరీలో 4వేల ఎకరాలకు పైగా అక్రమాలు జరిగినట్లు తేలిందని, సీఐడీ రిక్వెస్ట్ తో ఈడీ కూడా రంగప్రవేశం చేసిందన్నారు. దీనిపై సీబీఐతో ఎంక్వైరీ చేయిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని, తద్వారా చంద్రబాబు లీలలన్నీ బట్టబయలవుతాయని అన్నారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బాబు నేరాలకు ఆధారాలున్నాయ్..

బాబు నేరాలకు ఆధారాలున్నాయ్..


‘‘రాజధాని విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నేరపూరితంగా వ్యవహరించాడు. కృష్ణా జిల్లా తిరువూరులో రాజధాని వస్తుందని అధికారికంగా ప్రకటించిన మూడు నెలలకే మళ్లీ మాట మార్చి.. విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ప్రకటనకు ముందు, తర్వాత టీడీపీకి చెందిన నేతలు భారీ ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు నేరాలపై సీఐడీ దగ్గర ప్రాధమిక ఆధారాలున్నాయి. వాటి ఆధారంగానే ఈడీ స్పందించింది. వెంటనే సీబీఐతోనూ విచారణ జరపాలని వైసీపీ కోరుతోంది''అని మిధున్ రెడ్డి లోక్ సభలో అన్నారు.

టీడీపీ సభ్యుల అభ్యంతరం..

టీడీపీ సభ్యుల అభ్యంతరం..

చంద్రబాబుపై సీబీఐ విచారణ కోరుతూ మిథున్ రెడ్డి చేసి స్పీచ్ లో ప్రధాని మోదీని కూడా ప్రస్తావించారు. ‘‘లోక్ సభ ఎన్నికలకు ముందు చంద్రబాబు.. బీజేపీని, మోదీని ఖతం చేస్తానని దేశమంతా తిరిగారు. అప్పట్లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి కూడా ఆయన మద్దతు పలికారు. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీతో కనీసం కలిసి కూర్చోడానికి కూడా టీడీపీ ఇష్టపడటంలేదు. దీన్ని బట్టే చంద్రబాబు తీరును అర్థం చేసుకోవచ్చు''అని అన్నారు. వైసీపీ ఎంపీ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేంద్రం గ్రీన్ సిగ్నల్?

కేంద్రం గ్రీన్ సిగ్నల్?

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, భూముల అక్రమాలపై ఈడీ విచారణకు ఆదేశించిన కేంద్రం.. సీబీఐ విచారణకు కూడా అంగీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రక్రియను అధికారికంగా ముందుకుతీసుకెళ్లే క్రమంలోనే వైసీపీ ఎంపీలు ఈ డిమాండ్ ను సభలో ప్రస్తావించారని, తర్వాతి స్టెప్ గా కీలక వ్యక్తులకు వినతులు సమర్పించడం, ఆ వెంటనే ఎంక్వైరీకి ఆదేశాల జారీ ఉండొచ్చని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

English summary
ysrcp raises the issue of amaravati land scam in lok sabha on monday. party leader in lok sabha mithun reddy demands center to order cbi inquiry in the matter. tdp members opped the statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X