Anam Ramanarayana Reddy : ఎమ్మెల్సీ ఓటు ఎవరికంటే ? వైసీపీ ఎమ్మెల్యే ఆనం క్లారిటీ..!
ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఓటు ఓవరికి వేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
అమరావతి : ఏపీలో తాజాగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్ధానిక సంస్ధల కోటాలో 9 ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే ఈ నెలలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. వీటిలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా పేరు తెచ్చుకున్న ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు ఎవరికి వేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విప్ జారీ చేసే అవకాశం కూడా లేకపోవడంతో వీరిని అడ్డుకునేందుకు వైసీపీకి ఎలాంటి అవకాశం లేదు. అదే సమయంలో టీడీపీ కూడా తమ అభ్యర్ధిని నిలబెట్టి ఉత్కంఠ మరింత పెంచింది.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఓటు ఓవరికన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీ మాట్లాడారు. ఇందులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. దీనికి ఆనం నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని చెప్పినట్లు ఆనం ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోరులో తన ఓటుపైనా స్పందించారు.

ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోనూ ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. స్పందించిన అనం..ఎప్పుడూ ఆత్మ ప్రబోధానుసారమే ఓటేస్తానంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. కానీ వైసీపీకి ఓటు వేస్తానని మాత్రం ఆయన చెప్పకపోవడంతో ఆయన ఏం చేయబోతున్నారనేది తేలిపోయిందని భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోరులో ఆనం, కోటంరెడ్డి ఓట్లపై ఆశలు పెట్టుకున్న టీడీపీ.. తమ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధను నిలబెట్టింది. అంతే కాదు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని, వారు తమకే ఓటేస్తారని కూడా నిన్న మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు.












Click it and Unblock the Notifications