Raghurama-Chandrababu : చంద్రబాబుకు ప్రాణహాని ? ప్రధానికి రఘురామ లేఖ..
అనపర్తి ఘటనల నేపథ్యంలో టీడీపీ అధినేతకు ప్రాణహాని ఉందని అనుమానిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ ప్రధాని మోడీకి లేఖ రాశారు.
ఏపిలో తాజాగా చోటు చేసుకున్న అనపర్తి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అనపర్తిలో సభ పెట్టనివ్వకుండా అడ్డుకోవడంపై కాంగ్రెస్ మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు పలువురు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా దీనిపై స్పందించారు.

అనపర్తిలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న ఘటనపై స్పందించిన రఘురామకృష్ణంరాజు.. ఆయన ప్రాణాలకు హాని ఉందని ఇవాళ ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఆయన ఓ లేఖ రాశారు. ఇందులో చంద్రబాబు పర్యటనల్ని పోలీసులు అడ్డుకుంటున్న తీరును ప్రస్తావించారు. అంతే కాదు చంద్రబాబుకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోవాలని రఘురామ కోరారు.












Click it and Unblock the Notifications