జగన్‌పై ఫిర్యాదుల వెల్లువ -త్వరలో ఏపీకి అమిత్ షా -కేంద్ర హోం మంత్రితో వైసీపీ ఎంపీ రఘురామ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు తీరు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేంద్రంలోని మోదీ సర్కారుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం నాడు గంటల వ్యవధిలోనే ఏపీ ప్రతిపక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు, వైసీపీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజులు కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పలు అంశాలను ఎంపీలు హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వివరాలిలా ఉన్నాయి..
జగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీ

కేంద్ర మంత్రితో రఘురామ భేటీ
అధికారికంగా వైసీపీలోనే కొనసాగుతున్నప్పటికీ, సొత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రతిరోజూ విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం ఢిల్లీలో మరోసారి సందడి చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. కేంద్రం పెద్దలతో నిరంతరం టచ్ లో ఉంటూ, వీలైనప్పుడల్లా జగన్ సర్కారుపై ఫిర్యాదు లేఖలు రాస్తుండటం, వాటికి కేంద్రం నుంచి కూడా త్వరితగతిన రియాక్షన్ వస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ భేటీ అయ్యారు. 20నిమిషాల పాటు సాగిన భేటీలో మాట్లాడిన అంశాలను ఎంపీ రఘురామ మీడియాకు వివరించారు..

త్వరలో ఏపీకి అమిత్ షా..
''ఏపీలో దేవాలయాలపై దాడుల కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని హోంమంత్రి అమిత్ షాను కోరాను. నాకు వై కేటగిరీ భద్రత ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపా. విభజన హామీలు, పోలవరం సహా అనేక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లా. విభజన చట్టం ప్రకారం రావలసిన నిధులు, రాష్ట్ర సమస్యలను వివరించాను. కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరతాయని ఆశాభావం ఉంది. రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులు, అమరావతి సెంటిమెంట్‌ను కూడా ప్రస్తావించాను. ఏపీ పర్యటనకు రావాలని అమిత్ షా గారిని కోరా, త్వరలో వస్తా అన్నారు. నా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు'' అని రఘురామ తెలిపారు. అంతకుముందు..

జగన్‌ను కేంద్రమే నిలువరించాలంటూ..
గడిచిన 19 నెలలుగా జగన్ పాలనలో ఏపీలో అరాచకం పేట్రేగిపోతోందని, మత మార్పిడులు, ఆలయాలపై దాడులు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం, కుప్పకూలిన శాంతిభద్రతలు.. ఇలా ప్రతి అంశం వివాదాస్పదంగానే తయారైందని టీడీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. జగన్ రాజ్యాంగ వ్యతిరేక పోకడలను కేంద్రమే నిలువరించాలని కోరామని, ఏపీలో పరిస్థితులను చూస్తూ కూర్చోలేమని అమిత్ షా భరోసా ఇచ్చినట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. మొత్తంగా బుధవారం అమిత్ షా ఆఫీసు, నివాసం వద్ద ఏపీ నేతల సందడి, జగన్ పై ఫిర్యాదుల వెల్లువ కనిపించింది.
Recommended Video
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications