ఆ ఇద్దరు ఐపీఎస్ లపై సీబీఐ, ఎన్ఐఏ దర్యాప్తు ! మోడీకి రఘురామ ఫిర్యాదు..

ఏపీలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆరునెలలకే ఆ పార్టీతో విభేదించడం మొదలుపెట్టిన రెబెల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు.. తాజాగా మరో కలకలం రేపారు. గతంలో ఏపీలో చోటు చేసుకున్న ఓ వివాదానికి సంబంధించి ఇవాళ ప్రధాని మోడీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఇందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని మోడీని కోరారు. దీంతో ఎన్నికల వేళ రఘురామ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీలో రెండేళ్ల క్రితం వైసీపీ సర్కార్ సీఎం వైఎస్ జగన్ పై నిత్యం ఆరోపణలు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీతో రాజద్రోహం కేసు పెట్టించింది. దీంతో ఆయన్ను హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరుకు తీసుకొచ్చారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు చేసే సమయంలో సీఐడీ అధికారులు రఘరామను తమ కస్టడీలో హింసించినట్లు ఆరోపణలు చేసారు. అనంతరం ఈ ఆరోపణల్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. ఆ కేసును రఘురామ ఇప్పుడు తిరగతోడుతున్నారు.

ysrcp rebel mp raghurama raju complained pm modi against 2 ips officers over his cusodial torture

అప్పట్లో గుంటూరులో సీఐడీ కస్టడీలో తనను హింసించిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తనను హింసించిన వారిలో వీరిద్దరూ కూడా ఉన్నారని ఆరోపించారు. దీంతో ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని రఘురామ కోరారు.

వాస్తవానికి రఘురామపై అప్పట్లో నమోదైన రాజద్రోహం కేసులో విచారణ కొనసాగుతుండగానే సుప్రీంకోర్టు రాజద్రోహం కేసులు నమోదు చేయొద్దని, అప్పటికే నమోదైన కేసుల్లోనూ దర్యాప్తు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రఘురామపై అప్పట్లో సీఐడీ నమోదు చేసిన కేసు ముందుకు సాగలేదు. కానీ కస్టడీలో హింసపై మాత్రం సుప్రీంకోర్టులో రఘురామ వేసిన పిటిషన్ మాత్రం పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానికి రఘురామ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+