పక్కా వ్యూహంతో రఘురామ-బీజేపీ నుంచి పోటీ-అమరావతి అజెండా-ఉపఎన్నికకు రెడీ

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామాకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో తాను గతంలో పోటీ చేసి గెలిచిన నరసాపురం నుంచే తిరిగి మరోసారి ఉపఎన్నికల్లో గెలిచేందుకు రఘురామ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం రఘురామ వారం రోజుల గడువు పెట్టుకున్నారు. వారం రోజుల్లో తన ప్రకటనపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే రాజీనామా చేసి నరసాపురంలో ఉపఎన్నిక తెచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

 రఘురామ రాజీమామాస్త్రం

రఘురామ రాజీమామాస్త్రం

గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి ఆ తర్వాత సొంత పార్టీపైనే రెండేళ్లుగా పోరాటం చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఈసారి వైసీపీకి మరో ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇవాళ కీలక ప్రకటన చేశారు. త్వరలో తాను రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో వైసీపీలో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్లోనే ఉంటున్న రఘురామ.. తన పదవికి రాజీనామా చేశాక ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.

 వైసీపీకి వారం గడువు

వైసీపీకి వారం గడువు

తనపై అనర్హత వేటు వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీకి రఘురామ ఇవాళ వారం రోజుల గడువు ఇచ్చారు. ఆలోపు తనపై అనర్హత వేటు వేయించాలని సవాల్ విసిరారు. ఆ లోగా వైసీపీ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వారం తర్వాత వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఎంపీ పదవికి తానే రాజీనామా చేస్తానని రఘురామరాజు ఇవాళ ప్రకటించారు. దీంతో ఈ వారంలో ఏం జరగబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.

 బీజేపీ నుంచి రఘురామ పోటీ

బీజేపీ నుంచి రఘురామ పోటీ

వారం రోజుల తర్వాత వైసీపీ నుంచి తనకు లభించిన ఎంపీ పదవికి రఘురామకృష్ణంరాజు రాజీనామా సమర్పించబోతున్నారు. అనంతరం ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి లోక్ సభకు జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ఇవాళ వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లు వైసీపీ చెప్తున్నట్లుగా అధికారికంగా ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశముంది. రెండేళ్లుగా బీజేపీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన రఘురామకు ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీకి రాజీనామా చేసి కాషాయ తీర్ఘం పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Recommended Video

    AP Cabinet : APలో కేబినెట్ విస్తరణ.. ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం..!! || Oneindia Telugu
     పక్కా వ్యూహంతోనే ?

    పక్కా వ్యూహంతోనే ?

    బీజేపీలో చేరేందుకు గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న రఘురామరాజు.. ఆ పార్టీ నేతలతో ఢిల్లీలో టచ్ లో ఉంటున్నారు. అలాగే ఎంపీలతో రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా సమావేశాలు అవుతున్నారు. అలాగే బీజేపీ అగ్రనేతలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ అమరావతి అజెండాను అందుకోవడంతో ఇప్పుడు రఘురామ పని మరింత సులువైనట్లు కనిపిస్తోంది. మరోవైపు నరసాపురం ఎలాగో గతంలో బీజేపీ గెలిచిన సీటే కావడంతో ఇప్పుడు అక్కడ నుంచి పోటీ చేస్తే తమకు ఫలితం సానుకూలంగా ఉంటుందని రఘురామ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గోకరాజు గంగరాజు 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+