వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గ్రాఫ్ పై మళ్లీ చర్చ ? CNOS సర్వే ఫలితాలతో-వైసీపీ ఫేక్ వాదనలో నిజమెంత ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలుదీరి మూడేళ్లు దాటిపోయింది. మరో రెండేళ్లలో ఎలాగో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. ఆలోపే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతోంది. ఈ మేరకు వైసీపీ చేస్తున్న హంగామాతో విపక్ష పార్టీలు కూడా అప్రమత్తమైపోయాయి. మహానాడుతో టీడీపీ సవాల్ విసరగా.. ప్లీనరీతో వైసీపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు వాస్తవ పరిస్దితుల్ని తెలుసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో సీఎం జగన్ పనితీరు దేశంలో మిగతా ముఖ్యమంత్రులతో పోలిస్తే అధ్వాన్నంగా ఉందని సీఎన్ఓఎస్ ఇచ్చిన సర్వే నివేదిక ప్రభుత్వంలో, వైసీపీలో తీవ్ర చర్చకు కారణమవుతోంది.

జగన్ కు సీఎన్ఓఎస్ సర్వే షాక్

జగన్ కు సీఎన్ఓఎస్ సర్వే షాక్


కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు దాటిపోయింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే జాతీయస్ధాయిలో బీజేపీని ఎదుర్కొనే స్ధాయిలో మిగతా పార్టీలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా రాజకీయ స్తబ్ధత నెలకొంది. ఏపీలోనూ వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తికావడం, విపక్షాలు వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే పరిస్ధితుల్లో లేకపోవడంతో ఇక్కడా అదే పరిస్దితి. ఇలాంటి సమయంలో దేశంలో ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రుల పనితీరుపై జాతీయ సర్వేసంస్ధ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ స్టడీస్ (CNOS) తాజాగా సర్వే విడుదల చేసింది. ఇందులో మెరుగైన పనితీరు చూపుతున్న ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం జగన్ ఎక్కడో అట్టడుగున నిలిచారు. అట్టడుగు నుంచి ఆరో స్ధానంలో, మొత్తంగా 20వ స్ధానంలో నిలిచారు.

సర్వే ఫేక్ అంటున్న వైసీపీ

సర్వే ఫేక్ అంటున్న వైసీపీ


ఏపీలో వైసీపీకి ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతుంటే సీఎన్ఓఎస్ మాత్రం జగన్ పనితీరు దిగజారిదంటూ సర్వే విడుదల చేయడం వైసీపీలో మంటపుట్టిస్తోంది. తాము అధికారంలోకి వచ్చాక ప్రతీ ఎన్నికల్లో భారీ విజయాలతో గెలుస్తుండటం, విపక్షాలు డిపాజిట్లు కోల్పోయే స్ధాయిలో ఉన్నాయని వైసీపీ చెబుతోంది. అలాంటి సమయంలో జగన్ పనితీరు బాగోలేకపోతే ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తాయని ప్రశ్నిస్తోంది. ఇదంతా టీడీపీ కుట్రేనంటూ ఆరోపిస్తోంది. జాతీయస్దాయిలో గతంలోనూ ఇలాంటి ఫేక్ సర్వేల్ని టీడీపీ విడుదల చేయించిందని విమర్శిస్తోంది. దీంతో ఈ సర్వేలో వాస్తవాలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

జగన్ పనితీరుకు అద్దంపట్టిందన్న టీడీపీ

జగన్ పనితీరుకు అద్దంపట్టిందన్న టీడీపీ

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పనితీరుపై ముందునుంచీ విమర్శలు గుప్పిస్తున్న విపక్ష టీడీపీ ఇప్పుడు సీఎన్ఓఎస్ సర్వే నివేదికలోనూ అదే విషయం బయటపడిందని టీడీపీ నేతలు చెప్తున్నారు.గతంలో తాము ఇదే విషయం చెప్పినప్పుడు వైసీపీ నేతలు ఒప్పుకోలేదని, కానీ ఇప్పుడు జాతీయ స్ధాయిలో సర్వే సంస్ధే వాస్తవాల్ని బయటపెట్టిందని, ఇప్పటికైనా అధికార పార్టీ వాస్తవాలు గుర్తించాలని టీడీపీ కోరుతోంది. ఇంకా భ్రమల్లో ఉంటే వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని హెచ్చరిస్తోంది. సర్వే ఫేక్ అంటూ వైసీపీ చేస్తున్నవాదనపైనా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 సీఎన్ఓఎస్ సర్వే వాస్తవమిదీ !

సీఎన్ఓఎస్ సర్వే వాస్తవమిదీ !


సీఎన్ఓఎస్ సర్వేలో జరిగిన అధ్యయనం ముఖ్యమంత్రుల పనితీరు, పాలన మీద మాత్రమే. వారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల్లో గెలుపు వంటి అంశాల మీద కాదు. పాలనపై పట్టు, పాలనలో అనుసరిస్తున్న విధానాలు, వాటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ వంటి ఎన్నో అంశాల్ని ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చారు. తాజా సర్వేలో సీఎం జగన్ పై పనితీరుపై 39 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ పాలనపై 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 32 శాతం మంది తటస్థంగా ఉండిపోయారు. వాస్తవంగా చూస్తే జగన్ పాలనలో సంక్షేమ పథకాల్లో కోతలు మొదలైపోయాయి. అలాగే గతంలో ఉన్నన్ని అంచనాలు ఇప్పుడు లేవు. పాలనపై పట్టు సంపాదించడం కంటే బహిరంగంగా విపక్షాలపై విమర్శలకు జగన్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్ధూలంగా చూస్తే పైకి కనిపిస్తున్న ఈ గాలి బుడగ వాస్తవమా కాదా అన్న దానిపై జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ దృష్టిసారించడం లేదనే విమర్శ కూడా వినిపిస్తోంది. ఫైనల్ గా టీడీపీకి ప్రస్తుత పరిస్ధితుల్లో జాతీయ స్ధాయిలో సర్వేలపై ప్రభావం చూపే అవకాశాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి.

English summary
latest cnos survey report indicates falling of ap cm ys jagan's graph among chief ministers but ysrcp leaders have refutes this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X