ఎర్రచందనం స్మగ్లింగ్: జగన్ పార్టీ సర్పంచ్ అరెస్ట్, ధర్నా

 YSRCP sarpanch held for smuggling
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులైన సర్పంచులను చిత్తూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారని చాలాకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం ఎస్ఐ వెంకటేశ్వర్లును విఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు.

గురువారం ఉదయం టాస్క్‌ఫోర్సు ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది ఎర్రావారిపాళెం మండలంలోని చెరుకువారిపల్లె పంచాయతీ పులిపుత్రివాండ్లపల్లెలోని సర్పంచి నడిపి రెడ్డెప్ప రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సర్పంచి వర్గీయులు గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. అదే సమయంలో మండల కేంద్రంలో ఉన్న కమళ్లయ్యగారిపల్లె సర్పంచి ఊటుకూరి చెంగల్ రెడ్డిని భాకరాపేట ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు.

మరోవైపు డిసెంబరు 18వ తేదీ రాత్రి చెరుకువారిపల్లె పంచాయతీ ఆదినారిపల్లె సమీపంలో సుమారు రూ.2 కోట్లు విలువైన ఆరు టన్నుల ఎర్రచందనాన్ని లారీలో తరలిస్తుండగా భాకరాపేట ఎస్సై నెట్టికంఠయ్య ఆధ్వర్యంలో దాడులు చేసి పట్టుకున్నారు.

అయితే సంఘటన స్థలం ఎర్రావారిపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండడంతో కేసు నమోదుకు దుంగలు, లారీ, నిందితులను ఎర్రావారిపాళెం ఎస్సై వెంకటేశ్వర్లుకు అప్పగించాల్సిందిగా ఉన్నతాధికారులు భాకరాపేట ఎస్సైని ఆదేశించారు. అయితే ఈ కేసు నమోదులోనూ ఎస్సై వెంకటేశ్వర్లు జాప్యం చేసి, కేసును తప్పుదోవ పట్టించారు. దీంతో వెంకటేశ్వర్లును వేకన్సీ రిజర్వ్‌కు పంపుతూ ఎస్పీ గురువారం ఆదేశాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+