ముదిరిన తిరుమల లడ్డూ వివాదం- వైసీపీ బిగ్ స్టెప్
పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ కాలేదంటూ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఏకంగా సీబీఐ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కల్తీ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి.
దీన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. తిరుమల లడ్డూ వివాదంలో దర్యాప్తు చేసిన సీబీఐ ఛార్జ్‌షీట్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తమ పార్టీతో పాటు వైఎస్ జగన్ పై ఆరోపణలు గుప్పిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్ని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై తక్షణమే తగిన చర్య తీసుకోవాలని కోరింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.

సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్ లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ, తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితో పాటు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. తమ పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు, సాక్షాత్తూ సుప్రీంకోర్టుకు సీబీఐ దర్యాప్తు టీమ్ ఇచ్చిన ఛార్జిషీట్ ను తప్పు పట్టేలా, వారి పరువుకు భంగం కలిగించే విధంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు.
ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌లో ఎలాంటి నేరారోపణలు చేయలేదని గుర్తుచేశారు. అయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, ఫొటోలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని లేళ్ల అప్పిరెడ్డి వివరించారు.
వాటిని ఏర్పాటు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ అలాంటి పనులు చేయకుండా చూడాలని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తూ, పరువు నష్టం కలిగించే ఆ ఫ్లెక్సీలు డిజైన్, ప్రింట్ చేసిన వారు, వాటికి నిధులు సమకూర్చడం, రవాణా సదుపాయాలను కల్పించిన వారు, ఏర్పాటు చేసిన వారిపైనా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఉందని, వెంటనే నిషేధించాలని కోరారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications