సీఎం జగన్ నిర్ణయం సరైనదే - దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది..!!
ఏపీలో జరిగిన సదస్సు ద్వారా ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపీ చూస్తోందని తాజా మాజీ మంత్రులు చెబుతున్నారు.
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ సక్సెస్ జోష్ వైసీపీలో కనిపిస్తోంది. రాష్ట్రానికి రూ 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు..ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తరలి రావటంతో పార్టీ నేతలతో హ్యాపీగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన తొలి పెట్టుబడి సదస్సు సక్సెస్ అంటూ చెప్పుకొస్తున్నారు. దీని ద్వారా సీఎం జగన్ సమర్ధత స్పష్టం అయిందని విశ్లేషిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే పెద్ద మొత్తం లో ఎంఓయులు జరగటం.. వాటి అమలు కోసం ముఖ్యమంత్రి సదస్సు వేదిక నుంచే స్పష్టత ఇవ్వటం పైనా మంత్రులు స్పందిస్తున్నారు. ఏపీలో జరిగిన సదస్సు ద్వారా ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపీ చూస్తోందని తాజా మాజీ మంత్రులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ సమర్ధవంతంగా..క్రమశిక్షణలో పెట్టుబడి దారుల సదస్సు నిర్వహించారని మంత్రి బొత్సా పేర్కొన్నారు. ఎంఓయూలు చేసుకోవటం కోసం మాత్రమే పరిమితం కాలేదని.. వాటిని గ్రౌండింగ్ చేయించాల్సిన బాధ్యతను కూడా స్పష్టంగా చెప్పారన్నారు. ఇందు కోసం సీఎస్ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను బొత్సా ప్రస్తావించారు. టీడీపీ హయాంలో ఇటువంటి సదస్సుల సమయంలో ప్రయోజనం కంటే ప్రచారం ఎక్కువగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఆర్బాటం కోసమే సదస్సులు నిర్వహించే వారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పరిశ్రమలు..పెట్టుబడుల విషయంలో ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి స్పష్టం చేసారు. విశాఖ సదస్సు సక్సెస్ అయిందని మంత్రి బొత్సా చెప్పుకొచ్చారు. ఎంఓయూలు గ్రౌండ్ అవుతాయని స్పష్టం చేసారు.

మాజీ మంత్రి బాలినేని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తొలి నుంచి జగన్ పక్కా విజన్ తో ముందుకు వెళ్లే నాయకుడని చెప్పారు. విశాఖ సదస్సు ద్వారా ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. ఏపీలో పెట్టుబడి పెట్టేవాళ్లు లేరని ప్రచారం చేస్తున్న వారికి సీఎం జగన్ తన సత్తా ఏంటో చాటి చెప్పారని వ్యాఖ్యానించారు. రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారన్నారు. ముఖేష్ అంబానీ లాంటి వారు ఈ సదస్సులో కీలక పాత్ర పోషించారి చెప్పారు. ఈ ఒప్పందాల ద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. టీడీపీ తమ హయాంలో జరిగిన ఎంఓయూలు.. గ్రౌండ్ అయిన వాటి గురించి చెప్పాలన్నారు. ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే విశాఖ ను రాజధానిగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పుకొచ్చారు అమరావతి లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. విశాఖ రాజధాని చేయాలనేది సీఎం జగన్ సరైన నిర్ణయంగా బాలినేని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications