పోలీసులకు ఏబీ, ఆర్పీఠాకూర్ ఫోన్లు ? పోలింగ్ బూత్ లోకి పవన్ భార్యా ? టీడీపీపై వైసీపీ ఫైర్..
ఏపీలో ఇవాళ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా గతంలో సస్పెండైన డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మరో రిటైర్డ్ డీజీ ఆర్పీఠాకూర్ సాయంతో పోలీసులను ప్రభావితం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసింది. అలాగే పవన్ కల్యాణ్ తన భార్యను ఓటు లేకపోయినా పోలింగ్ బూత్ లోకి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించింది.
రెండు సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డీజీ ఆర్ పి ఠాగూర్, మరికొందరు పోలీస్ అధికారులు మంగళగిరి టీడీపీ ఆఫీసు లో కూర్చుని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్ లు చేసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు దిగుతున్నారని వైసీపీ లీగల్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. నిరాశా నిస్పృహలతో టీడీపీ నేతలు రాష్ర్ట వ్యాప్తంగా పలుచోట్ల హింసకు,దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.

ప్రజాస్వామ్యంలో హింసకు,దౌర్జన్యాలకు తావులేకుండా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే పరిస్దితి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాపట్లలో నందిగం సురేష్ ఎన్నికల ఏజంట్లు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారని, కారును ధ్వంసం చేసి వారిని భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. రెండు సార్లు సస్పెండ్ అయిన అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు రిటైర్డ్ డిజి ఆర్పీ ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చుని జిల్లాల్లోని పోలీసు అదికారులకు ఫోన్ లు చేసి రానుంది టీడీపీ ప్రభుత్వం కాబట్టి తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.
అలాగే మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు వేసే సందర్భంలో ఆయన భార్య కూడా పోలింగ్ బూత్ లోకి రావడం నిబంధనలకు విరుధ్దం అని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అలా ఆమెను పోలింగ్ సిబ్బంది ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications