సిద్ధం సభకు పోటెత్తిన జనం..15 లక్షల మంది హాజరు: వైసీపీ
బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నేత సీఎం జగన్‌ను చూసేందుకు ఆయన చెప్పే మాటలను వినేందుకు ప్రజలు తరలి వచ్చారు. మొత్తంగా 15 లక్షల మంది సిద్ధం సభకు హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గ్రీన్ మ్యాట్ వేసి అక్కడ చాలామంది ప్రజలు వచ్చినట్లుగా టీడీపీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. అయితే అసలు జనాలు ఎంతమంది వచ్చారో ప్రత్యక్షంగా చూసేందుకు సభాస్థలికి రావాల్సిందిగా వైసీపీ ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది.
చివరి సభ కావడంతో పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభను అనుకున్న విధంగానే సక్సెస్ చేసింది. దీంతో వైసీపీ క్యాడర్‌లో మరింత జోష్ పెరిగింది. సీఎం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే సీఎం సీఎం అనే నినాదాలు మిన్నంటాయి. దాదాపు గంటకు పైగా సాగిన సీఎం జగన్ ప్రసంగం పై అక్కడికొచ్చిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తనను ఓడించేందుకు చంద్రబాబు అండ్ కో మరో జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని.. అయితే తన పొత్తు మాత్రం ప్రజలతోనే ఉంటుందని సీఎం చెప్పినప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలు చప్పట్లు కొట్టారు.

ఇదిలా ఉంటే సభ ప్రారంభానికి ముందు ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. దీనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. లోకేష్ ఇలాంటి ట్రిక్కులు ఎన్ని చేసినా వాటిని తొక్కిపడేస్తామని అనిల్ ధ్వజమెత్తారు.దమ్ముంటే సభాస్థలికి వచ్చి జగన్‌ను ప్రేమించే వారు ఎంతమంది వచ్చారో ప్రత్యక్ష్యంగా చూడాలని అన్నారు.అయితే ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పంపారో విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరింది వైసీపీ పార్టీ.
మరో వైపు ఉదయమే ఓ వృద్ధురాలు జగన్‌ను చూసేందుకు సభాస్థలికి వచ్చి అక్కడే కుర్చీలో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాంటి వారే తమ స్టార్ క్యాంపెయినర్లంటూ వైసీపీ నాయకులు నేతలు పేర్కొన్నారు. ఇక ప్రతి ఇంటికి మంచి జరిగింటేనే తనకు ఓటు వేయాల్సిందిగా జగన్ అభ్యర్థించారు. ఈ మాటకు ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారని ఇలా చెప్పే దమ్మున్న నాయకుడు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా కనిపించరని వైసీపీ నేతలు అన్నారు.
సిద్ధం సభ డ్రోన్ షాట్స్.. 1.5 మిలియన్ మంది సభకు హాజరయ్యారని వెల్లడించిన వైసీపీ వర్గాలు..!#CMYSJagan #YSJaganAgain #Siddham #WhyNot175 #YSRCP #Elections2024 #AndhraPradesh #Addanki #Oneindiatelugu pic.twitter.com/ZR0LpSARyu
— oneindiatelugu (@oneindiatelugu) March 10, 2024
మొత్తం మీద నాలుగు సిద్ధం సభలు జరుగగా.. ప్రతి సభకు ప్రజలు అభిమానులు పోటెత్తారని వైసీపీ చెబుతోంది. ఇక చివరగా అద్దంకిలోని మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభను 350 ఎకరాల్లో నిర్వహించగా.. 15 లక్షల మంది సభకు రావడం ఒక రికార్డని వైసీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications