లోకేష్ తో భేటీలో వైసీపీ సోషల్ కార్యకర్త ! తమ్ముళ్ల రచ్చ..! సిస్కోకు మంత్రి ఘాటు లేఖ..!
ఏపీ రాజకీయాల్లో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ సిస్కో సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కలిసి పనిచేసేందుకు వారితో చర్చలు జరిపి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా సిస్కో ప్రతినిధులతో కలిసి వచ్చిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇప్పాల రవీంద్రారెడ్డితో కలిసి ఫొటోలు దిగారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు.
ఇప్పాల రవీంద్రా రెడ్డిని కలిసిన లోకేష్ గారు!!
— BheemBoy💕🇮🇳 Eat millets Stay Healthy🙏 (@PITCHBOSS) March 25, 2025
కుటుంబ సభ్యుల మీద బూతు రాతలు రాసి బూతు ప్రచారాలు చేసినా క్షమించి కలవటం ....
న భూతో న భవిషత్
కందకి లేని దురద కత్తి పీటకి ఎందుకులే!! @OfficeofNL pic.twitter.com/bKDnDsQpV6
గతంలో చంద్రబాబు, లోకేష్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇప్పాల రవీంద్రారెడ్డి ఇవాళ నేరుగా వచ్చి మంత్రితో భేటీ కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం లోకేష్ దృష్టికి వెళ్లింది. సిస్కోతో ఈ రోజు ఉదయం ఏపీ ప్రభుత్వం చేసిన ఎంఓయు సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ గా ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరు అయినట్లు లోకేష్ ఆఫీసు వర్గాలు గుర్తించాయి.

ఇప్పల రవీంద్రా రెడ్డి అంట !?
— Manchodu Mani (@manchodumani) March 25, 2025
ఇతను సిస్కో కంపెనీలో ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక ఏరియా మేనేజర్ గా చేస్తున్నాడు అని తెలిసింది !?
అంటే.. అంత హై ప్రొఫైల్ కంపెనీలో హై పొజిషన్ లో వర్క్ చేస్తున్న ఇతను కూడా... గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కి మద్దతుగా & తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా… pic.twitter.com/46O6K6pW5y
గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులను కూడా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ చేస్తూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యవహారం తెలుసుకున్న లోకేష్.. సీరియస్ అయ్యారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. వెంటనే స్పందించిన లోకేష్ పేషీ సిబ్బంది సిస్కోకు ఘాటుగా లేఖ రాశారు. సోషల్ మీడియాలో ఇప్పాల రవీంద్రారెడ్డి తమ పార్టీ న్యాయకత్వం, నేతలపై పెట్టిన పోస్టులను గురించి ప్రస్తావించిన లోకేష్ ఓఎస్ డి.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని కోరారు.
ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన బృందం పేర్లలో ఇప్పాల పేరు లేకపోయినా అతనిని తీసుకురావడం పట్ల లోకేష్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము రాసిన మెయిల్ పై వెంటనే రెస్పాండ్ అవ్వాలని కూడా సిస్కోను కోరారు. దీనిపై సిస్కో స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications