Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షర్మిలపై వ్యూహం మార్చిన వైసీపీ - కడప కేంద్రంగా, ఇక..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం పతాక స్థాయికి చేరింది. జగన్ లక్ష్యంగా టీడీపీ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ లక్ష్యంగానే ప్రచారం చేస్తున్నారు. కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల వైసీపీ ఓట్ బ్యాంక్ పైనే ఫోకస్ చేసారు. జగన్ పరోక్షంగా షర్మిల వ్యాఖ్యలపైన ఇప్పటి వరకు స్పందించారు. ఇప్పుడు షర్మిల తీరు పైన ఆగ్రహంగా ఉన్న వైసీపీ వ్యూహం మార్చింది. షర్మిల ను ఆత్మరక్షణలోకి నెట్టేలా కొత్త ప్లాన్ తో ముందుకు వెళ్తోంది.

జగన్ పై షర్మిల వ్యాఖ్యలు
పీసీసీ చీఫ్ ఇప్పటి వరకు జగన్ పైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా జగన్ సతీమణి భారతి పైన పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో..వైసీపీ నేతలు ఎన్నికల సమయంలో షర్మిల వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని...షర్మిల గురించి ఇతర పార్టీల నేతల పైన స్పందిస్తున్న తరహాలోనే రియాక్ట్ కావాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా...వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ కుటుంబం పైన షర్మిల విషం కక్కుతున్నారని మండిపడ్డారు. జగన్ వ్యక్తిత్వం, స్వభావం మీకు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ ఎవరిచేతిలో అయినా రిమోట్ కంట్రోల్ గా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. భారతి పైన చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు.భారతిపై దుమ్మెత్తిపోయడం దారుణమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

YSRCP strong counter for YS Sharmila on her allegations against YS Jagan in Kadapa Election campaign

చంద్రబాబు చెప్పినట్లుగా
షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి ఎంతోమందిని సర్వనాశనం చేసి చాప చుట్టేశారు.కారణం లేకుండా పార్టీని క్లోజ్ చేసుకువచ్చారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుచేతిలో ష‌ర్మిల కీలుబొమ్మ అని విమ‌ర్శించారు. ఆయన జేబు బొమ్మలులాగా షర్మిల, సునీతలు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. వ్యక్తిగతమైన ఎజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అసలు మీ అజెండా ఏంటో చెప్పండి అని ప్ర‌శ్నించారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డికి సీటు ఇస్తే ఇంతగా విషం చిమ్ముతారా ,అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నందుకు వైయ‌స్‌ జగన్ ద్వేషమ‌న్నారు. ఎవరి వ్యక్తిగత ఎజెండా కోసమో కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడే దయనీయస్దితిలో కాంగ్రెస్ ఉంద‌న్నారు. వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల ఎజెండాగా కనిపిస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

వైసీపీకి నష్టం లేదు
తెలంగాణా లో షర్మిలను కాంగ్రెస్ లో అడుగుపెట్టనీయకుండా చేసిన రేవంత్ ఈ రోజు సహాయసహకారాలు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ కి చెల్లెళ్లు అనే హోదా తప్ప షర్మిల, సునీతలకు ఈ రాష్ట్రంలో ఏముంద‌ని నిల‌దీశారు. చంద్రబాబు వీరిద్దరితో పిచ్చెక్కినట్లు మాట్లాడించేలా ఆడిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మేలు చేయడానికి ఎంతగా తపన పడుతున్నారో అర్దమవుతుందన్నారు. వివేకానందరెడ్డి పరువు షర్మిల, సునీతలు నడిరోడ్డు మీద పెట్టారన్నారు. మీరు చెప్పినట్టు వైయ‌స్ జగన్ వినలేదని చంద్రబాబు జేబులో బొమ్మలుగా మారుతారా అని ప్ర‌శ్నించారు. షర్మిల,సునీతల వల్ల తమకు జరిగే నష్టం ఏమీ లేదని వాసిరెడ్డి పద్మ చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+