జగన్ పై ఎయిర్ గన్ తో దాడి - హత్యాయత్నం కేసు..!?
సీఎం జగన్ పై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆరు టీంలను ఏర్పాటు చేసారు. 20 మంది టాస్క్ ఫోర్స్ సిబ్బందితో విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు జగన్ పైన హత్యాయత్నం జరిగినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసారు. జగన్ భద్రత పైన ప్రత్యేకంగా చర్యలు ప్రారంభించారు.
సంచలన ఆరోపణ
జగన్ పైన జరగిన దాడిని వైసీపీ నేతలు ఖండించారు. ఈ దాడి పైన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్‌పై జరిగింది రాళ్ల దాడి కాదని.. ఎయిర్ గన్ వినియోగించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కణతకు గురిపెట్టి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేసారు. అదృష్టవశాత్తు జగన్ బయటపడినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇది రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇటు ఘటన పైన పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.

కేసు నమోదు
నగర పోలీసు కమిషనర్ ఈసీకి ప్రాధమిక సమాచారం అందించారు. ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేసారు. 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసారు. వైసీపీ నేతలు టీడీపీ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాము చేయలేదని చెప్పుకోవటంలో తప్పులేదని..వైసీపీనే చేసుకుందనేలా చేస్తున్న వ్యాఖ్యల పైన పార్టీ ముఖ్యులు మండిపడుతున్నారు. అటు జగన్ బస చేసిన కేసరపల్లి క్యాంపు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. రాజకీయంగా చేసిన దాడిగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడులకు చేసేలా ప్రేరేపించటం సరికాదని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.
రంగంలోకి ప్రత్యేక టీంలు
సీఎం స్థాయి వ్యక్తి పైన ఎటువంటి అండ లేకుండా సామాన్యులు దాడికి దిగరని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసారు. ఇటు ఎన్నికల ప్రచారం వేళ ముఖ్య నేతల భద్రత విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఘటన జరిగిన ప్రాంతంలో అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు సేకరిస్తున్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ నేతలు తప్పు బడుతున్నారు.












Click it and Unblock the Notifications