రూట్ మార్చిన జగన్: గెలుపు కోసం ఆ ప్రయత్నం కూడా!, ఫలిస్తుందా?
జగన్ సీఎం కావాలని కోరుతూ మలక్ పేటలోని వేద పండితుడు శివరామ ప్రసాదశర్మ నివాసంలో వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి శనివారం యాగాన్ని ప్రారంభించారు.
విజయవాడ: 2019ఎన్నికలే టార్గెట్‌గా అన్నీ తనకు అనుకూలంగా ఉండేలా సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్. రాజకీయంగా వ్యూహాస్త్రాలు సిద్దం చేస్తూనే.. దైవాన్ని కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే 'శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీయాగం'ను ఆ పార్టీ ప్రారంభించింది.
జగన్ సీఎం కావాలని కోరుతూ మలక్ పేటలోని వేద పండితుడు శివరామ ప్రసాదశర్మ నివాసంలో వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి శనివారం యాగాన్ని ప్రారంభించారు. 2019ఎన్నికల క్రతువు ముగిసేదాకా ఈ యాగం కొనసాగుతుందని చెబుతున్నారు. ఎన్నికలు దగ్గరపడే లోగా.. వీలు చూసుకుని జగన్ ఒకరోజు ఈ యాగంలో పాల్గొననున్నారు.

వైసీపీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక పూర్ణాహుతికి కూడా జగన్ హాజరవుతారని పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. మొత్తానికి అటు రాజకీయ పావులు కదుపుతూనే.. ఇటు శాస్త్రోక్తంగాను తన విజయానికి ఏ దోషమూ అడ్డురాకుండా చూసుకుంటున్నారు జగన్. ప్రశాంత్ కిశోర్ సలహాలు.. బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలతో భవిష్యత్తు ఎన్నికలకు సిద్దమవుతున్న వైసీపీకి ఈ యాగం ఎంతమేర దోహదపడుతుందో మరి!
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications