ఎన్నికల ముందే ఢిల్లీలో వైసీపీకి పెరిగిన బలం..!!
వైసీపీ అరుదైన అవకాశం దక్కించుకుంది. రాజ్యసభలో సంఖ్య బలం ఆధారంగా వైసీపీ అతి పెద్ద పార్టీగా అవిర్భవించబోతోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ నుంచి రాజ్యసభ మూడు సీట్లను ఏకగ్రీవంగా గెలుచు కోవటం లాంఛనప్రాయం. తెలంగాణలో రెండు స్థానాలు కాంగ్రెస్, ఒక స్థానం బీఆర్ఎస్ సభ్యులకు ఏకగ్రీవం కానున్నాయి. తాజాగా ముగ్గురు సభ్యుల గెలుపు ద్వారా రాజ్యసభలో వైసీపీ సంఖ్యా బలం 11 కి చేరనుంది.
దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగిసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. వీటికి, కేవలం వైఎస్ఆర్సిపి నుంచి ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేశారు. వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావులు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాగా రాజ్యసభ రేసు నుంచి తాము వైదొలిగింది. దీంతో, వైసీపీ ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం 9 నుంచి 11కి చేరుతోంది. టీడీపీ పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోనుంది. తాజాగా సంఖ్యా బలంతో వైసీపీ రాజ్యసభలో తొలి నాలులు పార్టీల్లో ఒకటిగా చేరనుంది.

2019 ఎన్నికల్లో వైసీపీ 22 మంది ఎంపీలను గెలవటం ద్వారా లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉంది. ఇప్పుడు రాజ్యసభలో ఆదే స్థానంలో నిలవనుంది. ఇటు, తెలంగాణలోనూ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అవ్వటం లాంఛనమే. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసారు. బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవి చంద్ర నామినేషన్ వేసారు. మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్దులే నామినేషన్లు దాఖలు చేయటంతో మూడు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ సమయం ముగిసిన తరువాత ఎన్నికల అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇటు టీడీపీ రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ రిటైర్ కానున్నారు. సంఖ్య బలం సరిపోక టీడీపీ తమ అభ్యర్దిని పోటీలో నిలబెట్ట లేదు. తొలుత అభ్యర్దిని పోటీ చేయించటం పైన ప్రయత్నం చేసినా చివరకు విరమించుకున్నారు. దీంతో, సార్వత్రిక ఎన్నికల వేళ రాజ్యసభ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవంగా ముగింయటంతో తొలి నుంచి కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెర పడింది.












Click it and Unblock the Notifications