వైసీపీ ఏడో జాబితా నేడు, కీలక మార్పులు - లిస్టులో సీనియర్లు..!!
సీఎం జగన్ పార్టీ అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరింది. ఏడో జాబితాను ప్రకటనకు సిద్దమైంది. ముఖ్య నేతల సీట్ల పైన ఈ జాబితాలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్ది వేమిరెడ్డి పార్టీ మార్పు ప్రచారంతో అక్కడ మార్పు ఖాయమైంది. అదే విధంగా గతంలో ప్రకటించిన సీట్లోనూ తాజా నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 18న అనంతపురం సిద్దం సభ ద్వారా పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు.
మరో జాబితా సిద్దం: వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు మరో జాబితా సిద్దమైంది. ఇక, అభ్యర్దుల ఖరారు ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేయాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్దిగా ఖరారు అయిన వేమిరెడ్డి ఇప్పుడు పార్టీ మార్పు ఖాయమని తెలుస్తోంది. దీంతో, ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని తిరిగి ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉంది. ఆయనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్దిగా గతంలో ఖరారు చేసారు.

అయితే, ఆదాలను ఎంపీగా ప్రకటిస్తే నెల్లూరు రూరల్ నుంచి మాలెం సుధీర్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. ఆదాల ను రూరల్ ఎమ్మెల్యే అభ్యర్దిగా కొనసాగిస్తే ఎంపీగా సుధాకర్ రెడ్డి లేదా మేకపాటి కుటుంబానికి కేటాయిస్తారని తెలుస్తోంది. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా సిద్దమేనని ఆదాల స్పష్టం చేయటంతో జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మార్పులు - చేర్పులు: మంగళగిరి సీటు పైన చర్చ జరుగుతోంది. స్థానికంగా తాజా పరిణామాల నేపథ్యంలో గంజి చిరంజీవి మార్పు పైన ప్రచారం మొదలైంది. అయితే, సీఎం జగన్ తాజాగా మంగళగిరి పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. దీంతో, అక్కడ పార్టీ అభ్యర్ది మార్పు విషయం పైన జగన్ ఆలోచన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.
అక్కడ విజయ సాయిరెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పంచాయితీ మరోసారి సీఎంవోకు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాల ఇన్‌చార్జిగా తననే నియమించాలని కోరారు. రేపల్లె సీటును ఆశిస్తున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు సీఎం కార్యాలయానికి వచ్చారు.
ప్రచారానికి సిద్దం: ప్రకాశం జిల్లాలో బాలినేని - చెవిరెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తనకే మళ్లీ కనిగిరి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన కోరారు. దీంతో, పాటుగా గతంలో ప్రకటించిన నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. కడప జిల్లాలోనూ మూడు స్థానాల్లో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి పేరు అధికారికంగా ప్రకటించనున్నారు.
కందుకూరు నుంచి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఈ జాబితాలో స్పష్టత రానుంది. ఇక..నెల్లూరు జిల్లాలో మార్పులు చేర్పుల పైన త్వరగానే తేల్చాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ నెల 18న అనంతపురం సిద్దం సభలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు నిర్ణయించారు. ఈ లోగా అభ్యర్దుల ప్రకటన పూర్తి చేసి..సిద్దం సభ ద్వారా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications