YSRCP vs TDP..పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత
భిన్నమైన రాజకీయ వాతావరణం ఉండే పల్నాడులో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం గురజాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు జరిగాయి. గురజాల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు తాను వస్తానని, అక్కడికి ఎవరైనా సరే రావచ్చంటూ కాసు ప్రకటించారు.
చెప్పినట్లుగానే కాసు మహేష్ రెడ్డి గురజాలకు చేరుకున్నారు. టీడీపీ నాయకులెవరైనా చర్చుకు రావాలన్నారు. ఆదివారం పేరు చెప్పి టీడీపీ నాయకులు పారిపోయారని విమర్శించారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే యరపతినేని స్పందించారు. అభివృద్ధి పై చర్చ అనేది ఆటవిడుపు కారాదని, మరో 10 రోజుల్లో చర్చించడానికి కొత్త తేదీని ప్రకటిస్తామని, ఆరోజు ఎమ్మెల్యే రావాలని కోరారు.

గురజాలలో అభివృద్ధి లేదని, తాము అధికారంలో ఉన్నప్పుడు రూ.1500 కోట్లతో చేసిన అభివృద్ధేనంటూ యరపతినేని మండిపడ్డారు. దీనిపై కాసు స్పందించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గురజాల నియోజకవర్గంలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు కాసు ప్రకటించారు.
గతంలో కూడా ఇరువురు నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో పల్నాడు వేడెక్కింది. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హత్యలకు గురవుతున్నారంటూ యరపతినేని శ్రీనివాసరావు వైసీపీపై ఆరోపణలు చేశారు. వీటిని మహేష్ రెడ్డి ఖండించారు.












Click it and Unblock the Notifications