Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాన్సాస్, సింహాచలం అక్రమాలపై ఎవరినీ వదిలిపెట్టం-సాయిరెడ్డి, అవంతి హెచ్చరికలు

విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం ఆలయ భూముల్లో అక్రమాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం మరో దర్యాప్తు చేయిస్తోంది. తాజాగా ఈ రెండు వ్యవహారాల్లోనూ చేయిస్తున్న దర్యాప్తు నివేదికలు త్వరలో అందుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ విశాఖలో ప్రకటించారు.

సింహాచలం దేవస్ధానం పరిధిలో కొన్ని వేల కోట్ల ఆస్తులు దుర్వినియోగం చేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. దేవస్థానం భూములు విషయం లో కోర్టు ఆదేశాలు లేకుండా ముందుకు వెళ్లలేమన్నారు. మరోవైపు పంచగ్రామాల సమస్యకు అతి త్వరలో పరిష్కారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. లబ్దిదారులకూ, దేవస్దానానికీ నష్టం కలగకుండా సమస్య పరిష్కరిస్తామన్నారు.

ysrcp warns not to spare anyone in mansas and simhachalam land issues

మాన్సస్ ,దేవస్థానం భూములపై కమిటీ వేసామని మంత్రి అవంతి తెలిపారు. నివేదిక త్వరలో సంబంధిత మంత్రికి అందజేస్తారని, ఆ తర్వాత చర్యలు ఉంటాయన్నారు. చంద్రబాబు గతం లో మూడు సార్లు ముఖ్యమంత్రి గా చేసినా.. చివరిసారి ముఖ్యమంత్రి గా చేసినప్పుడు భూదోపిడి ఎక్కువగా జరిగిందని మంత్రి అవంతి ఆరోపించారు. ప్రభుత్వ,దేవస్థానం భూములు విషయంలో తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. తద్వారా మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతిరాజుతో పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకు సహకరించిన వారికీ హెచ్చరికలు పంపారు.

Recommended Video

    #TopNews : AP Exams - ప్రభుత్వానికి ,పేరెంట్స్ కి మధ్య Communication Gap | Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+