కూటమి Vs వైసీపీ, తాజా ఫలితాలు - సీన్ రివర్స్, డేంజర్ బెల్స్..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది. కూటమిని లక్ష్యంగా చేసుకొని మాజీ సీఎం జగన్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. పలు కార్పోరేషన్లు.. మున్సిపాల్టీలను కైవసం చేసుకునేందుకు కూటమి పావులు కదుపుతోంది. ఇదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాల వెల్లడయ్యాయి. ఈ ఫలితాలు వైసీపీ వర్సస్ కూటమి మధ్య హోరా హోరీగా జరిగాయి. కానీ, తాజా ఫలితాలతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.
హోరా హోరీ ఎన్నికల్లో
ఏపీలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 52 ఎంపీపీ స్థానాలతో పాటుగా కడప జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది. కడపలో జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలని తొలుత భావించిన కూటమి చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. ఫలితంగా జెడ్పీ తిరిగి వైసీపీ ఖాతాలో చేరింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా పది ఎంపీపీ స్థానాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక, ఎన్నికలు జరిగిన చోట వైసీపీ 32 గెలవగా.. కూటమి 11 స్థానాలకు పరిమితం అయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే దక్కించుకుంది. కూటమి 164 స్థానాలతో పాటుగా మెజార్టీ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి.
వైసీపీ ఖాతాలో
కడప జిల్లా జెడ్పీ చైర్మన్ గా వైయస్ఆర్‌సీపీ జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా పరిషత్ పరిధిలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 2021 ఎన్నికల్లో 49 స్థానాలను వైసీపీ గెలిచింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి జెడ్పీ చైర్మ గా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో జెడ్పీ చైర్మన్ పదవికి ఉప ఎన్నిక జరిగింది. కొందరు జెడ్పీటీసీలు పార్టీ ఫిరాయించగా.. ఇప్పటికీ 42 మంది జెడ్పీటీసీ వైసీపీ వెంటే ఉన్నారు. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ తర్వాత టీడీపీకి సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు. కీలక పరిణామాల తరువాత చివరకు ఉప ఎన్నికలో జెడ్పీ పీఠాన్ని వైసీపీ గెలుచుకుంది.

ఎంపీపీ స్థానాల్లో..
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు. సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి నాగమ్మ విజయం సాధించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి బండి లక్ష్మీదేవి గెలుపొందారు. అనంత జిల్లా కంబదూర్ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి కురుబ లక్ష్మీదేవి ఏకగ్రీవమయ్యారు. కర్నూలు జిల్లా తుగ్గలి ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి రాచపాటి రామాంజినమ్మ గెలుపొందారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి ఆల్ల సుబ్బమ్మ గెలుపొందారు. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. తాజా ఫలితాలు వైసీపీలో జోష్ పెంచుతుంటే.. కూటమి నేతలు అలర్ట్ అయ్యారు. తాజా ఫలితాలతో భవిష్యత్ రాజకీయాల పైన ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications