వైఎస్ జగన్ ఎలక్షనీరింగ్‌లో హైలైట్స్ ఇవే

YSRCP 3rd list: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. మూడు విడతల్లో 59 లోక్‌సభ/అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.

ఇన్‌ఛార్జీల ఎంపికలో సామాజిక సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చారు జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొత్తవారికి అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చోటు ఇచ్చారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్.

YSRCPs 3rd list: YS Jagan has given top priority to the Women and youth

పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలను మార్చారు. తొలి రెండు జాబితాల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించారో.. మూడో లిస్ట్‌లో కూడా అదే ముద్ర కనిపించింది. సామాజిక సమతౌల్యం కనిపించింది. ఇప్పటివరకు వెనుకబడిన సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యేల కోటాలో 40, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో 67 శాతం మేర ప్రాధాన్యత ఇచ్చారు.

ఎంపీ కోటాలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌న్‌ను ఇచ్చినట్టయింది. ఎమ్మెల్యేల కేటగిరీలో ఈ సంఖ్య 12 శాతం వరకు ఉంది. ఎమ్మెల్యేల కోటాలో 36, ఎంపీల్లో 11 శాతం మేర యువతకు ప్రాతినిథ్యాన్ని కల్పించినట్టయింది. చివరి విడతగా మరో జాబితా కూడా వెలువడే అవకాశం ఉన్నందున.. ఈ సంఖ్య మరింత పెరగొచ్చు.

విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బీసీ- మహిళను నియమించడం హైలైట్. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని ఇక్కడ బరిలో నిలిపారు. తిరుపతి ఎంపీగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మద్దిల గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జీగా నియమించారు. అక్కడున్న ఎస్సీ నేత కోనేటి ఆదిమూలం.. ఇక తిరుపతి ఎంపీగా పోటీ చేస్తారు.

బీసీ మంత్రి జోగి రమేష్‌ను పెడన నుంచి స్థానచలనం కల్పించారు. ఆయనను పెనమలూరుకు మార్పు చేశారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాంను ఈ సారి లోక్‌సభ అవకాశాన్ని ఇచ్చారు జగన్. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా నిలిపారు. కీలకమైన ఏలూరు ఎంపీ స్థానం నుంచి యాదవ సామాజిక వర్గ యువ నేత కారుమూరి సునీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+