జూనియర్ వైఎస్సార్..!!

అమరావతి: ఇవ్వాళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఘనంగా నివాళి అర్పించారు. కడప జిల్లాలోని ఇడుపుల పాయలో గల వైఎస్సార్ ఘాట్‌‌ను సందర్శించారు. తల్లి విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డి, కుమారుడు రాజారెడ్డితో కలిసి నివాళి అర్పించారు.

మధ్యాహ్నం ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్నారు. తండ్రికి ఘనంగా నివాళి అర్పించారు. ఆ సమయంలో ఆయన వెంట.. తల్లి విజయమ్మ, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

YSRCP

వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ ఇవ్వాళ ప్రత్యేకంగా డిజిటల్ క్యాంపెయిన్‌ను చేపట్టింది. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. లక్షలాది మంది అభిమానులు ఆయనను స్మరించుకున్నారు. పరిపాలనకు మానవత్వం జోడించిన వైఎస్సార్‌ అంటూ నినదించారు. ఆయనకు ఘన నివాళి అర్పించారు.

YSRCP

రెండు తెలుగు రాష్ట్రాల్లో గల వైఎస్సార్ విగ్రహాల వద్ద సెల్ఫీలు దిగారు. తమ చిన్నారులకు వైఎస్సార్ గెటప్‌ను వేసి అభిమానాన్ని చాటుకున్నాు. లెగసీ లివ్స్ ఆన్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

YSRCP

తన పరిపాలనతో ఓ బెంచ్ మార్క్‌ను సృష్టించారు వైఎస్సార్‌. ఆయన పాలన చూసిన ప్రజలు.. వైఎస్‌ జగన్‌‌కు బ్రహ్మరథం పడుతున్నారు. జులై 8వ తేదీ వైఎస్సార్‌ జయంతి సందర్బంగా రాష్ట్ర రైతు దినోత్సవంగా ప్రకటించారు జగన్. ఇవ్వాళ అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన సభలో నిధులను విడుదల చేశారు.

YSRCP

ఈ ఏడాది వైఎస్సార్సీపీ క్యాడర్‌ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం పలికింది. వైఎస్సార్‌ జయంతి సందర్బంగా వైఎస్సార్‌ సీపీ సర్కార్‌ డిజిటల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీనిలో అనేక వినూత్న కార్యక్రమాలను తీసుకొచ్చింది. లెగసీ లివ్స్‌ ఆన్‌ అనే నినాదంతో వైఎస్సార్‌ అభిమానులకు సెల్ఫీ ఛాలెంజ్‌, క్విజ్‌ పోటీలను నిర్వహించారు.

YSRCP

కవితలు రాయడం, డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడటం, ఇతర ఏ కళలో వారు నైపుణ్యం ఉన్నా వారు ఈ డిజిటల్‌గా పాల్గొనవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో డిజిటల్‌ క్యాంపెన్‌ ప్రారంభమైంది. దీనిలో భాగంగా అనేకమంది యువకులు, వైఎస్సార్‌ అభిమానులు సెల్ఫీ విత్‌ వైఎస్సార్‌ స్టాట్ట్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ప్రాంతాల్లోఉన్న వైఎస్సార్‌ విగ్రహాల వద్దకు వెళ్లి సెల్ఫీ దిగి.. సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

దీనితో పాటు వైఎస్సార్‌ హయాంలో రాష్ట్రంలో జరిగిన మంచిని తెలియజేసేలా.. ఆయన హయాంలో తీసుకొచ్చిన పథకాలతో కూడిన క్విజ్‌ పోటీలను డిజిటల్‌ మాధ్యమంలో నిర్వహించగా.. అనేక ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఈ క్విజ్‌ పోటీల్లో విద్యావంతులు పాల్గొన్నారు. వైఎస్సార్‌ వేషధారణను పలువురు చిన్నారులు, పెద్దలు ధరించి ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+