మారిన జగన్ వైఖరి: అగ్రెసివ్

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన విస్తృతస్థాయి సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఈ నెల 19వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. ఇది- 22వ తేదీకి వాయిదా పడింది. 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతోండటం వల్ల తేదీని దానికి అనుగుణంగా మార్చారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత క్రమంగా పార్టీ నాయకులతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వరుస భేటీలను నిర్వహిస్తూ వస్తోన్నారు వైఎస్ జగన్. ఫలితాలను విశ్లేషించుకుంటోన్నారు. అసెంబ్లీలో 11, లోక్‌సభలో నాలుగు సీట్లకు పడిపోయేంత వ్యతిరేకత ప్రజల్లో తలెత్తడానికి గల కారణాలపై ఆరా తీస్తోన్నారు.

YSRCP s key meeting postponed to June 22

ఈ క్రమంలో- ఇదివరకు రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష నిర్వహించారాయన. దీనికి కొనసాగింపుగా ఈ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన శాసన సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది.

ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడం, భవిష‌్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలనే విషయంపై చర్చించడం, పార్టీ క్యాడర్‌పై దాడులు, చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వంపై ఎలా ఎదురుదాడికి దిగాల్సి ఉంటుందనే విషయంపై అవసరమైన సూచనలు, సలహాలను పార్టీ నాయకుల నుంచి స్వీకరించడానికి ఏర్పాటైన విస్తృతస్థాయి సమావేశం ఇది.

19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాబోతోండటం వల్ల సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఈ భేటీలో చర్చించాలని తొలుత భావించారు. అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి ఆరంభం కాబోతోండటం వల్ల దానికి అనుగుణంగా పార్టీ విస్తృత స్థాయి భేటీని 22కు వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+