పచ్చ కండువాతో రఘురామ
అమరావతి/వాషింగ్టన్: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరుకుడు పడని నియోజకవర్గాల్లో ఒకటి- పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్‌సభ. ఈ స్థానం వైఎస్ఆర్సీపీదే. అయినప్పటికీ- అక్కడ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటోన్నారు. తిరుగుబాటు నేతగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా సొంత పార్టీ వైఖరిని తప్పుపడుతూ వస్తోన్నారు.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం మరోసారి రఘురామ కృష్ణంరాజుకు టికెట్ ఇవ్వాలనుకోవట్లేదు వైసీపీ అగ్రనాయకత్వం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల నుంచీ రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తోన్న రఘురామకు బదులుగా నర్సాపురం లోక్‌సభలో కొత్త నాయకత్వం కోసం అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది.

నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటుబ్యాంక్. రఘురామ కృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి ఎన్నికల్లో 32 వేల ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనంతరం పార్టీకి దూరంగా ఉంటోన్నారు. సొంత పార్టీపైనే తిరుగుబాటు లేవనెత్తారు. రెబెల్‌గా గుర్తింపు పొందారు.
ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తోన్నారు. టెక్సాస్ స్టేట్‌లోని డల్లాస్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్‌కు హాజరు కానున్నారు. 30వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు టెక్సాస్ కన్వెన్షన్ సెంటర్‌లో తానా సభలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి ఇప్పటికే అమెరికా వెళ్లారాయన. హ్యూస్టన్, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాల్లో తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

తాజాగా ఇర్వింగ్‌లో తెలుగు ప్రముఖులను కలుసుకున్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు.. పచ్చకండువాను మెడలో వేసుకుని కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమం పొడవునా ఆయన పచ్చకండువాతోనే కనిపించారు. వైఎస్ఆర్సీపీ దూరంగా ఉంటోండటం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చేరువ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో- ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications