Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023: టీమిండియా కూర్పుపై సస్పెన్స్: జట్టు ప్రకటన..ఇంకొన్ని గంటల్లో

కొలంబో: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌ను ఆడుతోంది. ఇందులో పల్లెకెలె స్టేడియంలో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన నేపాల్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్.. సూపర్ 4లో అడుగు పెట్టగలుగుతుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు.. 48.2 ఓవర్లల్లో 230 పరుగులు చేసింది. నేపాల్ ఇన్నింగ్‌లో మిడిలార్డర్ కుప్పకూలినప్పటికీ- ఓపెనర్లు, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. బలమైన భారత జట్టు బౌలింగ్‌ను ఎదుర్కొని నిలిచారు. నిప్పు కణికల్లాంటి బంతులకు ధీటుగా బదులిచ్చారు.

Asia Cup 2023: Indias World Cup 2023 squad to be announced on September 5

టీమిండియా ముందున్న లక్ష్యం 231 పరుగులు. ఈ టార్గెట్‌ను ఛేదించగలిగితేనే జట్టు సూపర్ 4 దశకు చేరుకోగలుగుతుంది. ప్రస్తుతం రోహిత్ సేన బ్యాటింగ్ ఆర్డర్‌ను ఒక్కసారి పరిశీలిస్తే ఈ మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు గానీ.. వాతావరణం ఎలా మారుతుందనేది ఆసక్తి రేపుతోంది.

దీని తరువాత టీమిండియా ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌కు సన్నద్ధమౌతుంది. అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన.

ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. దీని తరువాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లతో తలపడుతుంది. నెదర్లాండ్స్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్.. లీగ్ దశలో చిట్ట చివరిది. నవంబర్ 12వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆ తరువాత నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

కాగా- వరల్డ్ కప్ 2023లో ఆడబోయే జట్టు ఏదనేది మంగళవారం తేలిపోనుంది. మధ్యాహ్నం 1:30 గంటకు టీమిండియా ప్లేయర్ల వివరాలు తెర మీదికి రాబోతోన్నాయి. జట్టు ఆటగాళ్ల పేర్లను వెల్లడించడానికి శ్రీలంకలోని క్యాండీ స్టేడియంలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.

ఈ నెల 15వ తేదీ నాటికి వివరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు అందజేయాల్సి ఉన్న నేపథ్యంలో క్యాండీలోనే జట్టును ప్రకటించనుంది సెలెక్షన్ కమిటీ. ఆసియా కప్ 2023లో జట్టు ఆటగాళ్ల ప్రతిభ, ఫిట్‌నెస్ వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోనుంది. మొత్తం 15 మందితో పాటు ముగ్గురు లేదా అయిదుమంది స్టాండ్ బై ఆటగాళ్ల వివరాలనూ సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+