అక్రమ సంబంధం, భార్యను గొడ్డలితో చెక్కలు చీల్చినట్లు చీల్చేసిన భర్త!
బెంగళూరు/బాగల్ కోటే: మీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని, ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటానని యువతి తండ్రికి చెప్పిన యువకుడు ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత కొన్ని సంవత్సరాలు భార్యతో ఆమె భర్త సంతోషంగా కాపురం చేశాడు. అయితే అక్రమ సంబంధం కారణంగా భార్య గొంతును కర్రెలు చీల్చినట్లు గొడ్డలితో ఆమె గొంతు చీల్చి దారుణంగా చంపేశాడు.
కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని బీలగి తాలుకాలోని బిసనాళ గ్రామంలో పరసప్ప (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బిసనాళ సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న రేఖా (25) అనే యువతి ఇంటికి పరసప్ప వెళ్లాడు. మీ అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని రేఖా తండ్రికి చెప్పాడు.

అయితే రేఖాను పరసప్పకు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. కుటుంబ సభ్యులు, బంధువులను వెంటతీసుకెళ్లిన పరసప్ప రేఖా కుటుంబ సభ్యులతో మాట్లాడించాడు. మీ అమ్మాయికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని, ఇంట్లోనే పెట్టుకుని తాను కష్టపడి డబ్బు సంపాధించి ఆమెను, పుట్టబోయే పిల్లలను పోషించుకుంటానని పరసప్ప రేఖా తండ్రికి మాట ఇచ్చాడు.
పెద్దలు రాజీ చెయ్యడంతో తరువాత రేఖాను పరసప్పకు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న మూడు సంవత్సరాల పాటు పరసప్ప అతని భార్య రేఖాతో సంతోషంగా కాపురం చేశాడు. తరువాత మేస్త్రీ పనికి వెలుతున్న పరసప్పకు అతని భార్య రేఖా మీద అనుమానం వచ్చింది. తాను ఉదయం పనికి వెళితే రాత్రి ఇంటికి వస్తానని, పగలు ఇంట్లోనే ఉంటున్న తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని పరసప్పకు అనుమానం వచ్చింది.

ఇదే విషయంలో రేఖా, పరసప్ప దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి, నిత్యం దంపతులు గొడవపడటంతో వారికి చెప్పిచెప్పి విసిగిపోయిన గ్రామస్తులు వారి గురించి పట్టించుకోవడం మానేశారు. మంగళవారం రాత్రి పరసప్ప అతని భార్య రేఖాతో గొడవ పెట్టుకున్నాడు, నీ ప్రియుడిని మరిచిపోయి తనతో కలిసి ఉండాలని, లేదంటే నిన్ను చంపేస్తానని పరసప్ప అతని భార్య రేఖాను హెచ్చరించాడు.
ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోంది. సహనం కోల్పోయిన పరసప్ప ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని అతని భార్య రేఖా గొంతును కర్రెలు చీల్చినట్లు చీల్చేశాడు. పీక తెగిపోవడంతో కేకలు వెయ్యలేక కుప్పకూలిపోయిన రేఖా రక్తపుమడుగులో కిందపడిపోయింది. ఆ సమయంలో రక్తపు మడుగులో పడి ఉన్న భార్య రేఖాను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లాలని కూడా పరసప్పకు ఆలోచన రాలేదు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన రేఖా ఇంట్లోనే చనిపోయింది. బుధవారం బంధువులు వెళ్లి చూడగా రేఖా హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. పరసప్పను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బాగల్ కోటే జిల్లా పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం విషయంలో భార్య రేఖాను జంతువులను బలి ఇచ్చినట్లు ఆమె భర్త చంపేయడం బాగల్ కోటేలో కలకలం రేపంది.












Click it and Unblock the Notifications