పాదపూజ ఎఫెక్ట్, లవ్ మ్యారేజ్, పట్టపగలు అత్త ముందే భార్యను కిడ్నాప్ చేసిన భర్త!
బెంగళూరు/శివమొగ్గ: కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న యువతి, యువకుడు నాలుగు నెలల క్రితమే కుటుంబ సభ్యులను వ్యతిరేకించి కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే భీమ అమావాస్య కారణంగా పాదపూజ చెయ్యకుండా తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని రగిలిపోయిన భర్త కారులో వెళ్లి నడిరోడ్డులో అతని భార్యను కిడ్నాప్‌కు చేశాడు. బీమ అమావస్య సందర్బంగా భర్తలకు వారి భార్యలు పాదపూజలు చెయ్యడం కర్ణాటకలో ఆనవాయితి.
సోమవారం భీమా అమావాస్య సందర్భంగా భర్త తన భార్యను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ నగరంలోని దొడ్డపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగింది. మహిళ తల్లిదండ్రులు ఆమె భర్త మీద కిడ్నాప్ కేసు పెట్టారు. నాలుగు నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికులు కొన్ని కారణాలతో ఇటీవల విడిపోయారని తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్తతో కలిసి ఉండకుండా పుట్టింటికి చేరింది. ఈ సమయంలో తల్లిదండ్రులు కూడా యువతికి నచ్చ చెప్పి వారి ఇంట్లోనే పెట్టుకున్నారు. గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి పుట్టింటికి చేరిన భార్యను తిరిగి తీసుకురావడానికి ఆమె భర్త ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే తన తల్లిదండ్రులను వదిలిరానని అతని భార్య తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఊరు చేరిన భార్య ఆమె భర్తతో కలిసి వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భీమ అమావాస్య సందర్భంగా భర్తలకు వారి భార్యలు పాదపూజలు చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇక్కడ దూరం అయిన భార్య దగ్గర పాదపూజలు చేయించుకోవాలని ఆమె భర్త శివమొగ్గలోని ఆమె ఇంటికి బయలుదేరాడు. అయితే భార్య ఇంట్లో లేదు. తల్లితో కలిసి ఆమె బయటకు వెళ్లిందని భర్త తెలుసుకున్నాడు.
శివమొగ్గ సిటీ బస్‌స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జి ముందు భార్య, ఆమె తల్లి నడుచుకుంటూ వెళ్తుండగా ఇన్నోవా కారులో వెళ్లిన భర్త అతని భార్యను ఈడ్చుకెళ్లి బలవంతంగా కారులో కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన కుమార్తె కిడ్నాప్‌కు గురైందని దొడ్డపేట పోలీస్ స్టేషన్‌లో మహిళ తండ్రి ఫిర్యాదు చేశారు.
కులాంతర వివాహం చేసుకుందని, పరువు పోతుందని యువతి తల్లిదండ్రులు మీడియా ముందు మాట్లాడటానికి నిరాకరించారు. యువతి. యువకుడి పేర్లు వివరాలు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. దొడ్డపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.శివమొగ్గ నుంచి కిడ్నాపర్లు పరారైనారని తెలిసింది.












Click it and Unblock the Notifications