Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: కోటీశ్వరుడి భార్యతో కాంట్రాక్టర్?, కిడ్నాప్ చేసి భార్య కళ్ల ముందే ప్రియుడిని ఎలా చంపాడంటే ?, షాక్!

కోటీశ్వరుడికి అతని భార్య రొమాన్స్ మ్యాటర్ లీక్ అయ్యింది. భార్యను కలవడానికి వచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ ను భర్త కిడ్నాప్ చేశాడు. 12 గంటల పాటు ఎంత నరకం చూపించాలో అంత నరకం చూపించాడు.

బెంగళూరు/హోస్ కోటే./కోలారు: వివాహం చేసుకున్న మహిళకు పిల్లలు ఉన్నారు. భర్త కోటీశ్వరుడు. వ్యవసాయం చేయిస్తున్న భర్త వ్యాపారాలు చేస్తున్నాడు. కోట్లరూపాయల విలువైన భూములు ఉన్న భర్తకు ఆ ప్రాంతంలో మంచిపేరు ఉంది. వ్యాపారం, వ్యవసాయ పనుల మీద భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. అదే సమయంలో కోటీశ్వరుడి జీవితంలోకి ఓ కాంట్రాక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. కోటీశ్వరుడి భార్య ఆ కాంట్రాక్టర్ ను సెట్ చేసుకుంది.

భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య కాంట్రాక్టర్ తో మస్త్ మజా చేసింది. కోటీశ్వరుడికి అతని భార్య లీక్ అయ్యింది. అంతే భార్యను కలవడానికి వచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ ను భర్త కిడ్నాప్ చేశాడు. 12 గంటల పాటు ఎంత నరకం చూపించాలో అంత నరకం చూపించాడు. అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న భార్య కళ్ల ముందే ఆమె ప్రియుడిని వరైటీగా చంపేశాడు. భార్య ప్రియుడి శవాన్ని ఆమె భర్త ఏం చేశాడు ? అని అసలు మ్యాటర తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.

భర్త కోటీశ్వరుడు

భర్త కోటీశ్వరుడు

బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. అలాంటి బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే పట్టణం సమీపంలోని బైరనహళ్లిలో ప్రకాష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మాలశ్రీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ వివాహం చేసుకున్న ప్రకాష్ పిల్లలు ఉన్నారు. ప్రకాష్ కోటీశ్వరుడు. వ్యవసాయం చేయిస్తున్న ప్రకాష్ వ్యాపారాలు చేస్తున్నాడు. ప్రకాష్ కు కోట్లరూపాయల విలువైన భూములు హోస్ కోటే పరిసర ప్రాంతాల్లో, కోలారు జిల్లాలోని మాలురులో ఉన్నాయి.

కోటీశ్వరుడి భార్యతో కాంట్రాక్టర్?

కోటీశ్వరుడి భార్యతో కాంట్రాక్టర్?

ప్రకాష్ కు ఆ ప్రాంతంలో మంచిపేరు ఉంది. వ్యాపారం, వ్యవసాయ పనుల మీద ప్రకాష్ కారులో ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. హోస్ కోటే తాలుకాలోని దోడ్డనల్లూరు ప్రాంతంలో నందీష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నందీష్ లేబర్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. నందీష్ దగ్గర చాలా మంది పని చేస్తున్నారు. పలు కంపెనీలకు నందీష్ లేబర్ కాంట్రాక్టు కార్మికులను పంపిస్తున్నాడు. కోటీశ్వరుడు ప్రకాష్ భార్య మాలాశ్రీకి నందీష్ కు పరిచయం అయ్యింది.

ప్రియుడితో మస్త్ మజా చేసింది

ప్రియుడితో మస్త్ మజా చేసింది

రానురాను కాంట్రాక్టర్ నందీష్ తో మాలాశ్రీ చనువు పెంచుకుంది. భర్త ప్రకాష్ పనిమీద ఎక్కువగా బయట తిరుగుతుండటంతో అతని భార్య మాలాశ్రీ కాంట్రాక్టర్ ప్రియుడు నందీష్ తో మస్త్ మజా చేసింది. భర్త ప్రకాష్ ఇంట్లో లేని సమయంలో నందీష్ అతని ఇంటికి వెళ్లిన అతని భార్య మాలాశ్రీతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రియురాలు మాలాశ్రీ స్వర్గం చూపిస్తుండటంతో ఆమెకు నందీష్ దాసోహం అయిపోయాడు, నందీష్ కు ఇంతకు ముందే వివాహం అయ్యి పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు ఉన్నాడు.

ప్రియురాలికి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే?

ప్రియురాలికి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే?

తన భార్య కాంట్రాక్టర్ నందీష్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఇటీవల ఆమె భర్త ప్రకాష్ కు తెలిసిపోయింది. భార్య తనను మోసం చేస్తోందని ప్రకాష్ రగిలిపోయాడు. జనవరి 13వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో తాను కూలీలకు డబ్బులు ఇచ్చి వస్తానని భార్యకు చెప్పిన నందీష్ బైక్ లో బయలుదేరాడు. అప్పటికే మాలాశ్రీకి ఫోన్ చేసిన నందీష్ నేను వస్తున్నానని, మనం కలుసుకునే రహస్య ప్రాంతానికి రావాలని చెప్పాడు.

భార్య ప్రియుడిని కిడ్నాప్ చేసిన భర్త

భార్య ప్రియుడిని కిడ్నాప్ చేసిన భర్త

తన భార్య కోసం నందీష్ వస్తున్నాడని ప్రకాష్ కు తెలిసింది, మార్గం మధ్యలోనే నందీష్ ను అడ్డగించిన ప్రకాష్, అతని అనుచరులు అతన్ని కారులో కిడ్నాప్ చేశారు. కారులో అప్పటికే చెక్కలు పెట్టుకున్న ప్రకాష్ వాటితో నందీష్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. అర్దరాత్రి వరకు నందీష్ ను కారులో తిప్పుతూ ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు. ప్రకాష్, అతని అనుచరులు కొట్టిన దెబ్బలకు నందీష్ తల పగిలిపోయింది. కొన్ని గంటల పాటు నందీష్ కు కారులోనే నరకం చూపించారుజ నందీష్ ను నేరుగా ఇంటికి పిలుచుకుని వెళ్లిన ప్రకాష్ అతని భార్య ముందు ప్రియుడిని నిలబెట్టాడు.

బలవంతంగా విషం తినిపించి చంపేశారు

బలవంతంగా విషం తినిపించి చంపేశారు

అర్దరాత్రి నుంచి భార్య కళ్లముందే ఆమె ప్రియుడు నందీష్ కు ప్రకాష్ బలవంతంగా విషం తినిపించాడు. విషం తినడానికి నిరాకరించిన నందీష్ కు మళ్లీ నరకం చూపించారు. నందీష్ ను కొట్టికొట్టి అతనితో బలవంతంగా విషం తినిపించారు. అప్పటికే విపరీతమైన దెబ్బలు తిన్న నందీష్ విషం తినడంతో జనవరి 14వ తేదీ వేకువ జామున 4.30 గంటల సమయంలో ప్రియురాలి కళ్ల ముందే నందీష్ ప్రాణాలు వదిలేశాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య కళ్లముందే ఆమె ప్రియుడు నందీష్ ను చంపేసిన ప్రకాష్ అతని కసి తీర్చుకున్నాడు.

ఎరువులు వేసి శవాన్ని పూడ్చేసిన భర్త

ఎరువులు వేసి శవాన్ని పూడ్చేసిన భర్త

నందీష్ ను హత్య చేసిన తరువాత ప్రకాష్ తెలిసిన వ్యక్తికి చెందిన క్రేన్ మాలూరులోని బైరనహళ్లి గ్రామం సమీపంలోని తన పొలంలోకి రావాలని చెప్పారు. ఎరువులు వెయ్యడానికి గోతి తియ్యాలని చెప్పాడు. క్రేన్ తో పెద్ద గోయ్యి తీపించిన ప్రకాష్ తరువాత అతని ఇంటిలో ఉన్న నందీష్ శవాన్ని తీసుకెళ్లి అదే గోతిలో వేసి పైన ఎరువులు వేసి పూడ్చేశాడు.

అందరూ వ్యవసాయం చెయ్యడానికి ప్రకాష్ ఎరువులు తోలించాడని అనుకున్నారు. భార్య ప్రియుడు నందీష్ ను సొంత పొలంలో పూడ్చేసిన ప్రకాష్ చేతులు దులుపుకున్నాడు. నందీష్ మొబైల్ ఫోన్ మాలూరు సమీపంలో విసిరేసిన ప్రకాష్ తరువాత అతని ఇంటికి వెళ్లిపోయాడు.

హిజ్రా చేతిలో మొబైల్

హిజ్రా చేతిలో మొబైల్

మూడు రోజులు అయినా నందీష్ ఇంటికి రాకపోవడంతో అతని కొడుకు నందగుడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్సీ మల్లికార్జున్ స్వయంగా కేసు విచారణ చేశారు. నందీష్ ఉపయోగిస్తున్న ఫోన్ మాలూరో యాక్టీవ్ గా ఉందని, ఆ ఫోన్ నెంబర్ తో కాల్స్ చేస్తున్నారని తెలిసింది. మాలూరు వెళ్లి నందీష్ ఫోన్ ఉపయోగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో అతనికి నందీష్ కు సంబంధం లేదని తెలిసింది, ఓ హిజ్రా దగ్గర నేను రూ. 2 వేలకు ఫోన్ తీసుకున్నానని చెప్పాడు. హిజ్రాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే తనకు బైరనహళ్లి సమీపంలోని రోడ్డు పక్కన మొబైల్ చిక్కిందని హిజ్రా పోలీసులకు చెప్పింది.

కిలాడీ మేడమ్ మ్యాటర్ లీక్

కిలాడీ మేడమ్ మ్యాటర్ లీక్

నందీష్ కాల్ డేటాను పరిశీలించారు. జనవరి 13వ తేదీన నందీష్ చాలాసార్లు ఓ మహిళతో మాట్లాడాడని వెలుగు చూసింది. పోలీసులు నేరుగా ప్రకాష్ ఇంటికి వెళ్లారు. తనకు ఏమీ తెలీదని ప్రకాష్ భార్య చెప్పింది. అయితే ప్రకాష్ పోలీసుల ముందుకు వచ్చి నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని మా పరువు తీసిన నందీష్ ను తాను చంపేశానని అంగీకరించాడు.

పోలీసులను వెంటపెట్టుకుని మాలూరు సమీపంలోని పొలం దగ్గరకు వెళ్లిన ప్రకాష్ నందీష్ గాడి శవం ఇక్కడే పూడ్చేశానని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని లేబర్ కాంట్రాక్టర్ నందీష్ ను ప్రకాష్ అతని దారుణంగా నరకం చూపించి హత్య చెయ్యడం బెంగళూరు గ్రామీణ జిల్లాలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+