Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Air Ambulance: కరోనా రోగుల కోసం ఎయిర్ అంబులెన్స్, సౌత్ ఇండియాలో ఫస్ట్, ఐటీ, బీటీ!

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19 రోగులకు అత్యవసర సేవలు అందించడానికి Air Ambulance (ఎయిర్ అంబులెన్స్) సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సారి ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంలో ఎయిర్ అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రోడ్డు మార్గంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడటానికి ఎయిర్ అంబులెన్స్ సేవలు అందించడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఎయిర్ అంబులెన్స్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సంబంధిత అధికారులు తెలిపారు.

Recommended Video

    COVID-19 : India Crosses 34 Lakh Mark సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు : జార్ఖండ్ || Oneindia

    ఎయిర్ అంబులెన్స్ సేవలు

    ఎయిర్ అంబులెన్స్ సేవలు

    అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వెంటనే మెరుగైన చికిత్స అందించడానికి రోడ్డు మార్గాల్లో వారిని తరలిస్తున్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదురౌతున్న విషయం తెలిసిందే. వీఐపీలు, తీవ్ర ప్రమాదాలకు గురైన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించడానికి ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు అత్యవసర సేవల జాబితాలో కరోనా రోగులు చేరారు.

    సౌత్ ఇండియాలో ఫస్ట్

    సౌత్ ఇండియాలో ఫస్ట్

    భారతదేశంలో ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబాయి తదితర నగరాల్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఇంత వరకు ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులో లేవు. ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని బెంగళూరులో ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఐకాత్ మార్కెటింగ్ చీఫ్ ఫాహిమ్ హుస్సేన్ తెలిపారు.

    జక్కూర్ ఎయిర్ పోర్టు

    జక్కూర్ ఎయిర్ పోర్టు

    బెంగళూరు నగరంలోని బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలోని జక్కూర్ ఎయిరో డ్రమ్స్ (జక్కూరు ఎయిర్ పోర్టు) నుంచి ఎయిర్ అంబులెన్స్ సేవలను సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజారవాణా, వైమానిక శాఖ అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తరువాత కరోనా రోగులకు, ప్రజలకు అత్యవసర చికిత్స అందించడానికి ఎయిర్ అంబులెన్స్ సేవలు ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఫాహిమ్ హుస్సేన్ స్పస్టం చేశారు.

     ఎక్కడి నుంచి అయినా ఓకే

    ఎక్కడి నుంచి అయినా ఓకే

    రోగులను ఎక్కడి నుంచి అయినా ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయని ఫాహిమ్ హుస్సేన్ చెప్పారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతం అవుతున్న బెంగళూరు నగరంలో ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రావడం చాల సంతోషకరమైన విషయం అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+