Bengaluru: నిర్లక్షం చేస్తే తగిన మూల్యం చెల్లించాలి, ఐటీ హబ్ లో మళ్లీ వీకెండ్ కర్ఫ్యూ ? రాష్ట్రం మొత్తం !
బెంగళూరు/ముంబాయి: గత ఏడాది మార్చి నెలలో మొదలైన కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఇప్పటికీ ప్రజలు కోలుకోలేకపోతున్నారు. కరోనా వైరస్ పేరు చెబితే ప్రజలు పరుగు తీస్తున్నారు. ప్రపంచ దేశాలకు గడగడలాడిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో ఇంకా ప్రజలు కోలుకోకముందే మరోసారి కరోనా థర్డ్ వేవ్ తెర మీదకు వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ దెబ్బతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో మళ్లీ వీకెండ్ కర్ఫ్యూ, లాక్ డౌన్ అమలు చేసే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల సలహాలు తీసుకుంటున్నది. ఇటీవలే కర్ణాటకలో కొలువు తీరిన బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వానికి కరోనా థర్డ్ వేవ్ సవాలుగా మారడంతో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారని సమాచారం.

ఇప్పటికే వీకెండ్ కర్ఫ్యూ
కర్ణాటక సరిహద్దులోని కేరళ, మహారాష్ట్రలకు ఆనుకుని ఉన్న 8 జిల్లాల్లో (కర్ణాటకలోని జిల్లాలు) వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంది, మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారి నుంచి కర్ణాటకలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ దెబ్బతో కర్ణాటక సరిహద్దులోని కేరళ, మహారాష్ట్రలకు ఆనుకుని ఉన్న 8 జిల్లాల్లో వీకెండ్ కర్ఫ్యూను ఇప్పటికే అమలు చేస్తున్నారు.

గోడ మీద దీపంపెట్టిన మంత్రి
కర్ణాటకలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తారా ? అని మీడియా కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు ఆర్. అశోక్ ను ప్రశ్నిస్తే ఆయన గోడ మీద దీపం పెట్టినట్లు సమాధానం ఇచ్చారు. కర్ణాటక ప్రజలకు మళ్లీ లాక్ డౌన్, వీకెండ్ కర్ఫ్యూ ఎదురైయ్యే అవకాశం ఉన్నట్లు కనపడుతోందని, ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవడానికి నిపుణులతో చర్చిస్తున్నామని కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ అన్నారు. అయితే రాష్ట్రం మొత్తం లాక్ డౌన్, వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తామని కాని, చెయ్మమని కాని మంత్రి ఆర్. అశోక్ పక్కా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

కోవిడ్ టాస్క్ ఫోర్స్ నిర్ణయాలతో సీఎం ?
కర్ణాటకలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ విభాగం అధికారులు ఇస్తున్న సూచనల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోవిడ్ టాస్క్ ఫోర్స్ నిపుణులు సూచించడం వలనే ఇప్పటికే కర్ణాటకలోని 8 జిల్లాల్లో వీకెండ్ కర్ఫ్యూను అమలు చెయ్యాలని ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బోమ్మయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీకెండ్ కర్ఫ్యూ రాష్ట్రం మొత్తం అమలు చెయ్యాలా ? లేదా ? అనే విషయంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

దెబ్బ పడకూడదు అంటే ?
కర్ణాటక మొత్తం లాక్ డౌన్, వీకెండ్ కర్ఫ్యూ అమలు కాకుండా ఉండాలంటే మహారాష్ట్ర, కేరళ సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వానికి మనవి చేశారని తెలిసింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి కోవిడ్ పాజిటివ్ ఉన్నవాళ్లు కర్ణాటకలో ప్రవేశించడం వలనే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద కర్ణాటకలో లాక్ డౌన్, వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తారని ఊహాగాలు ఎక్కువ కావడంతో ప్రజలు హడలిపోతున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications