రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన పెన్ డ్రైవ్ పంచాయితీలు, సీక్రేట్స్ లీక్ చేస్తే?

బెంగళూరు/బెళగావి: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పడు పెన్ డ్రైవ్ పంచాయితీలు ఎక్కువ అయ్యాయి. పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పెన్ డ్రైవ్ లతో బ్లాక్ మెయిల్ కు పాల్పుడుతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి పెన్ డ్రైవ్ బాంబ్ పేల్చిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సవది పెన్ డ్రైవ్ బాంబు పేల్చారు. దీనిపై మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ సవది సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం బెళగావిలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ సవది నా దగ్గర పెన్ డ్రైవ్ ఉందనేది పచ్చి నిజం. సందర్భం వచ్చినప్పుడు ఆ పెన్ డ్రైవ్ లోని మ్యాటర్ మొత్తం విడుదల చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సత్యం ఏమిటంటే, నా దగ్గర పెన్ డ్రైవ్ ఉందని, సమయం వచ్చినప్పుడు ఆ పెన్ డ్రైవ్ బయటకు వస్తుందని, తన మీద ఎంత ఒత్తిడిని చేస్తే అంత త్వరబా ఆ పెన్ డ్రైవ్ బయటకు వస్తుందని లక్ష్మణ సవది అన్నారు.

Bengaluru: Karnataka is a hot topic with pen drive politics

ఆ పెన్ డ్రైవ్ లో రహస్యాలు ఏ పార్టీకి చెందినదో అనే విషయంలో త్వరలోనే అందరికి తెలుస్తోందని, అప్పటి వరకు అందరూ వేచి చూడాలని క్ష్మణ సవది చెప్పారు. వెటర్నరీ కళాశాల నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసిందని, గ్రాంటు మేమే ఇచ్చామని కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే మహేష్ కుమటల్లి ఆరోపించారు. ఇదే విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు లక్ష్మణ సవది స్పందించారు.

గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో వెటర్నరీ కళాశాలకు గ్రాంటు విడుదలైందని లక్ష్మణ సవది అన్నారు. ఇలాంటి సాధారణ జ్ఞానం లేకుండా బీజేపీ మాజీ ఎమ్మెల్యే మహేష్ కమటల్లి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అనుభవం, ఆలోచన లేకపోవడంతో మహేష్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది ఆరోపించారు.

గతంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు ఈ గ్రాంట్ విడుదలైందని, ఈ విషయం మహేష్ కు తెలిదని, చరిత్ర తెలీకుండా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని లక్ష్మణ సవది బీజేపీ నాయకును విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం అభివృద్ధి పనులకు గ్రాంట్లు కేటాయిస్తుంది. ఇది ఏ ప్రయివేటు వ్యక్తి దగ్గర ప్రజాధనం కాదు. నేను నీచ రాజకీయాలు చేసే వ్యక్తిని కాను అంటూ బీజేపీ నేతలపై లక్ష్మణ సవది మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+