బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Security: రంగంలోకి దిగిన పోలీసులు, వెయ్యి మంది సెక్యూరిటీ, నిషేధాజ్ఞలు, ఎక్కడ వేసినవి అక్కడే, అంతే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని చామరాజపేట్ లోని ఈద్గా మైదానంలో వినాయక చవితి ఉత్సవాలు, వినాయకుడి విగ్రహాల ఏర్పాటు చెయ్యడానికి అవకాశం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో చామరాజపేట్ లోని ఈద్గా మైదానంలో వేలాది మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. వెయ్యి మందికి పైగా పోలీసులు, అధికారులు చామరాజ్ పేట్ ఈద్గా మైదానంలో మకాం వేశారు.

మూడు రోజుల పాటు చామరాజపేట్ లోని ఈద్గా మైదానం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చామరాజపేట్ ఈద్గా మైదానంలో వేసిన టెంట్లతో పాటు ఎలాంటి వస్తువులు బయటకు తీసుకువెళ్లకుండా, బయట ఉన్న వస్తులు లోపలికి తీసుకెళ్లకుండా పోలీసు అధికారులు ఆంక్షలు విధించారు.

Illegal affair: ప్రియుడితో ముచ్చటగా మూడోసారి జంప్, ఎర్రగా ఉన్నానని బలుపు, కట్ చేస్తే ఫ్యాన్ కు వేలాడుతూ!Illegal affair: ప్రియుడితో ముచ్చటగా మూడోసారి జంప్, ఎర్రగా ఉన్నానని బలుపు, కట్ చేస్తే ఫ్యాన్ కు వేలాడుతూ!

మంగళవారం నుంచి ఏర్పాట్లు

మంగళవారం నుంచి ఏర్పాట్లు

మంగళవారం ఉదయం నుంచి చామరాజపేట్ లోని ఈద్గా మైదానంలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది టెంట్లు, పందిరిలు వెయ్యడం మొదలుపెట్టారు. మంగళవారం సాయంత్రం సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈద్గా మైదానంలో వినాయకుడి విగ్రహాల ఏర్పాటు చెయ్యడానికి బ్రేక్ పడింది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో పనులకు బ్రేక్

సుప్రీం కోర్టు ఆదేశాలతో పనులకు బ్రేక్

సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈద్గా మైదానంలో వినాయుడి విగ్రహాలు ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నించిన వారు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. ఈద్గా మైదానంలో ఉన్న వారిని పోలీసులు బయటకు పంపించేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో చామరాజపేట్ లోని ఈద్గా మైదానంలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చెయ్యడానికి అవకాశం లేదని బెంగళూరు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వేలాది మంది పోలీసులు ఎంట్రీ

వేలాది మంది పోలీసులు ఎంట్రీ

చామరాజపేట్ లోని ఈద్గా మైదానం మొత్తం పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ముగ్గురు డీసీపీలు, 21 మంది ఏసీపీలు, 47 మంది ఇన్స్ పెక్టర్లు, 130 మంది ఎస్ఐలు, 126 మంది ఏఎస్ఐలు, 900 మంది పోలీసులు, 120 మంది స్పెషల్ పోలీసులతో పాటు అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దింపారు. మూడు రోజుల పాటు చామరాజపేట్ లోని ఈద్గా మైదానం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Bengaluru: Supreme Court denied permission for Ganeshotsav in Chamarajpet Idgah Maidan, police security in Bengaluru
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X