Karnataka Polls : సిద్ధరామయ్యపై బీజేపీ అభ్యర్ధి ఖరారు ? హింట్ ఇచ్చిన యడియూరప్ప..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించింది. వచ్చే నెల 13 న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికలకు అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ 124 స్ధానాల్లో తొలివిడత అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఆ తర్వాత స్ధానంలో జేడీఎస్ 93 సీట్లకు అభ్యర్ధుల జాబితా ఇచ్చింది. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్ధుల్ని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉన్న సిద్ధరామయ్యపై పోటీ చేసే అభ్యర్ధిపై ఉత్కంఠ నెలకొంది.
మైసూరులోని వరుణ అసెంబ్లీ స్ధానం నుంచి ఈసారి సిద్ధరామయ్య బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ తొలి విడత అభ్యర్ధుల జాబితాలో ఆయన పేరు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ స్ధానం, అందునా మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు యతీంద్ర ఎమ్మెల్యేగా ఉన్న ఈ సీటును సిద్ధరామయ్య తప్పనిసరిగా గెల్చుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్యపై పోటీ చేసే అభ్యర్ధి యతీంద్రే అవుతారా లేక మరొకరిని బరిలోకి దించుతారా అన్న సస్పెన్స్ పెరుగుతోంది.

వరుణ అసెంబ్లీ సీటులో సిద్ధరామయ్యపై పోటీ చేసేందుకు బీజేపీలో పలువురు సిద్ధంగానే ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తన కుమారుడు యతీంద్రను కాదని మరో కుమారుడు బీవై విజయేంద్రను బరిలోకి దింపేందుకు యడియూరప్ప సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య బరిలోకి దిగితే ఆయన్ను ఢీకొని గెలవడం యతీంద్రకు అంత సులువు కాకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. దీంతో విజయేంద్రను బరిలోకి దింపి వరుణ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా తుది చర్చలు జరుగుతున్నట్లు యడియూరప్ప తెలిపారు.












Click it and Unblock the Notifications