మరో ఎమ్మెల్యే, యడియూరప్ప శిష్యులు టార్గెట్?, అసలు ఏం జరుగుతోంది మిత్రమా?

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల డేట్ ప్రకటించిన తరువాత ఆ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ప్రత్యర్థి పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు అంటూ ఇతర పార్టీల నాయకులు నిఘా వేస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప శిష్యుడు, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటకలోని హున్నాళి నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప శిష్యుడు రేణుకాచార్య బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. హున్నాళిలో మరోసారి ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్న రేణుకాచార్య బెంగళూరులో ఆయన మద్దతుదారులతో సమావేశం అయ్యారు.

Case registered against Yeddyurappas close associate, senior BJP MLA Renukacharya

బెంగళూరులోని శివానంద సర్కిల్ సమీపంలోని గురురాజ్ కల్యాణమండపంలో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఆయన మద్దతుదారులతో సమావేశం అయ్యారు. మైక్ సెట్ ఏర్పాటు చేసిన రేణుకాచార్య ఆయన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఎన్నికల కమీషన్ అధికారులు గురురాజ్ కల్యాణమండపంలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఎన్నికల కోడ్ నియమాల ప్రకారం ఎవరైనా రాజకీయ పార్టీ నాయకుడు సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందుగా ఎన్నికల అధికారులు, స్థానిక పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని. బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కల్యాణమండపంలో సమావేశం నిర్వహించారని ఆయన మీద కేసు నమోదు అయ్యింది.

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి బీఎస్. యడియూరప్ప చేసిన ప్రయత్నాలు లెక్కలేనన్ని ఉన్నాయని, ఆపరేషన్ కమలా పేరుతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూలి బీజేపీని అధికారంలోకి తెచ్చారని, అలాంటి యడియూరప్పను వయసు పైపడింది అని ఆయనతో సీఎం పదవికి రాజీనామా చేయించారని. ఇప్పుడు అప్ప అనుచరుల మీద వరుసగా కేసులు పెట్టిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+