బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating: మాజీ సీఎం కూతురు నేనే బిజినెస్ చేస్తున్నాము, రూ. 208 కోట్లకు రూ. 25 కోట్లు కమీషన్, క్లైమాక్స్ లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రభుత్వ కాంట్రాక్ట్ లు చేస్తున్న వ్యక్తికి వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని సమాచారం. ప్రభుత్వం నుంచి రావలసిన బిల్లులకు అతను భారీ మొత్తంలో కమీషన్ ఇవ్వడానికి సిద్దం అయ్యాడు. తనకు రావలసిన బిల్లులు మొత్తం ఇప్పిస్తే మీరు అడిగినంత డబ్బులు ఇస్తానని కాంట్రాక్టర్ అతని స్నేహితుడికి చెప్పాడు. రూ. 25 కోట్లు కమీషన్ ఇవ్వడానికి డీల్ ఓకే అయ్యింది. నెల రోజుల తరువాత ఓ లేడీ ఎంట్రీ ఇచ్చింది. నేను మాజీ సీఎం కుమార్తె వ్యాపార భాగస్వామి, మీకు ప్రభుత్వం నుంచి రావలసిన బిల్లులు మొత్తం నేనే ఇప్పిస్తాను అంటూ ఆ కాంట్రాక్టర్ దగ్గర భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంది. ప్రభుత్వ నుంచి బిల్లులు రాకపోవడం, తీసుకున్న డబ్బులు మహిళ తిరిగి ఇవ్వకపోవడంతో ఆ కాంట్రాక్టర్ అయోమయంలో పడిపోయాడు. నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగితే బూతులు మాట్లాడుతున్నారని ఆ కాంట్రాక్టర్ పోలీసు అధికారులను ఆశ్రయించాడు. మాజీ సీఎం కుమార్తె పేరుతో చీటింగ్ చేశారని వెలుగు చూడటంతో అధికార పార్టీ నాయకులు షాక్ అయ్యారు.

Officer: జాయింట్ కమీషనర్ కు బ్యాక్ తడిసిపోయింది, పీఏని పంపించి ఏం చేశాడంటే? !Officer: జాయింట్ కమీషనర్ కు బ్యాక్ తడిసిపోయింది, పీఏని పంపించి ఏం చేశాడంటే? !

ప్రముఖ కాంట్రాక్టర్

ప్రముఖ కాంట్రాక్టర్

బెంగళూరులో కర్ణాటక హ్యూమన్ రైట్స్ డిండర్స్ పేపర్ రిపోర్టర్ ఎంఆర్ రాజ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. 2021 జులై 23వ తేదీన సదాశివనగర్ లోని స్యాంకీ రోడ్డులోని కాఫీడేలో రాజ్ కుమార్, అతని స్నేహితుడు రమేష్ కుమార్ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రమేష్ కుమార్ స్నేహితుడు ఎండీ కామత్ అనే వ్యక్తి అదే కాఫీడేలోకి వెళ్లాడు.

రూ. 208 కోట్లు పెండింగ్ బిల్లులు ?

రూ. 208 కోట్లు పెండింగ్ బిల్లులు ?

ఆ సందర్బంలో రిపోర్టర్ రాజ్ కుమార్ తన స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ గోపాలక్రిష్ణ ప్రభుత్వ బిల్లులు పెండింగ్ పడిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని చెప్పాడు. గోపాలక్రిష్ణకు రూ. 208.56 కోట్ల రూపాయల బిల్లులు ప్రభుత్వం నుంచి రావాలని, ఆ బిల్లలు ఎలాగైనా ఇప్పించాలని రాజ్ కుమార్ అతని స్నేహితుడు రమేష్ కుమార్ కు చెప్పాడు.

 రూ. 25 కోట్లు కమీషన్

రూ. 25 కోట్లు కమీషన్

ప్రభుత్వం నుంచి గోపాలక్రిష్ణకు రావలసిన బిల్లులకు అతను భారీ మొత్తంలో కమీషన్ ఇవ్వడానికి సిద్దం అయ్యాడని రాజ్ కుమార్ అతని స్నేహితుడు రమేష్ కుమార్ కు చెప్పాడు. తనకు రావలసిన బిల్లులు మొత్తం ఇప్పిస్తే మీరు అడిగినంత డబ్బులు ఇస్తానని కాంట్రాక్టర్ గోపాలక్రిష్ణ అన్నాడు. మొదట రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. తరువాత కాంట్రాక్టర్ గోపాలక్రిష్ణ రూ. 25 కోట్లు కమీషన్ ఇవ్వడానికి డీల్ మాట్లాడుకున్నారు.

మాజీ సీఎం కుమార్తె ఫ్రెండ్ అని మస్కా

మాజీ సీఎం కుమార్తె ఫ్రెండ్ అని మస్కా

నెల రోజుల తరువాత అంబికా అలియాస్ నాగాంబిక అనే లేడీ ఎంట్రీ ఇచ్చింది. తాను మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమార్తె అరుణాదేవి వ్యాపార భాగస్వామి, మీకు ప్రభుత్వం నుంచి రావలసిన బిల్లులు మొత్తం నేనే ఇప్పిస్తాను అని అంబికా కాంట్రాక్టర్ గోపాలక్రిష్ణకు మాయమాటలు చెప్పింది. తను అవసరంగా ఉందని కాంట్రాక్టర్ గోపాలక్రిష్ దగ్గర అంబికా రూ. 40 లక్షలు తీసుకుంది.

 చీటింగ్ కేసులో అరెస్టు

చీటింగ్ కేసులో అరెస్టు


కాంట్రాక్టర్ గోపాలక్రిష్ణ దగ్గర రూ. 40 లక్షలు తీసుకున్న తరువాత అంబికా మాయం అయ్యింది. ప్రభుత్వం నుంచి రూ. 208 కోట్ల బిల్లులు రాకపోవడం, తీసుకున్న డబ్బులు అంబికా తిరిగి ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ గోపాలక్రిష్ణ అయోమయంలో పడిపోయాడు. నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగితే అంబికా బూతులు మాట్లాడుతున్నదని, మీరే న్యాయం చెయ్యాలని కాంట్రాక్టర్ గోపాలక్రిష్ణ, అతని స్నేహితుడు రిపోర్టర్ రాజ్ కుమార్ బెంగళూరులోని సదాశివనగర పోలీసు అధికారులను ఆశ్రయించారు.

మాజీ సీఎం అనుచరులు షాక్

మాజీ సీఎం అనుచరులు షాక్


కేసు నమోదు చేసిన పోలీసులు అంబికా అలియాస్ నాగాంబిక, ఎంఎస్ డీ. కామత్, రమేష్ కుమార్, జగదీష్ అనే వ్యక్తుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమార్తె అరుణాదేవి పేరుతో భారీ మొత్తంలో చీటింగ్ చేశారని వెలుగు చూడటంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు షాక్ అయ్యారు.

English summary
Cheating: Fraud in the name of Karnataka EX CM BS Yediyurappa daughters business partner in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X