Cheating: మంత్రి డెవలపర్స్ ఎండీకి సినిమా, ఈసారి సీఐడీ ఎంట్రీతో తండ్రీ కొడుకు అందర్, మ్యాటర్?!
బెంగళూరు: దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన మంత్రి డెవలపర్స్ సీఇఓ, ఎండీ అయిన సుశీల్ పాండురంగ మంత్రి అలియాస్ సుశీల్ మంత్రిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు పబ్లిసిటీ ఇచ్చి ప్రజల నుంచి లెక్కలేనన్ని కోట్లు వసూలు చేసి వాటిని తన సొంత అవసరాల కోసం వాడుకున్నారని, ప్రజలను మోసం చేశారని, అందుకే సుశీల్ మంత్రిని అరెస్టు చేశామని అధికారులు అంటున్నారు.
బెంగళూరులో సుమారు 7 నుంచి 10 సంవత్సరాలు అయినా ప్రజలకు ఫ్లాట్లు ఇవ్వకుండా మోసం చేశారని, ఐటీ అధికారులకు పన్ను ఎగవేశారని సుశీల్ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక బ్యాంకుల నుంచి మంత్రి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో సుమారు రూ. 5,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారని ఇప్పటికే ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఫేమస్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ
బెంగళూరుకు చెందిన సుశీల్ పాండురంగ మంత్రి మంత్రి డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్నారు. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరంలో అతి పెద్ద మంత్రిమాల్ కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో మంత్రి డెవలపర్స్ కూడా ఒకటి అని అందరికి తెలిసిందే.

వేల కోట్లు మోసం చేశారని?
ప్రజలకు విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్ ఇస్తామని తప్పుడు పబ్లిసిటీ ఇచ్చి ప్రజల నుంచి సుమారు రూ. 1,000 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారని మంత్రి డెవలపర్స్ ఎండీ సుశీల్ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తరువాత ప్రజలకు ఫ్లాట్స్ ఇవ్వకుండా వారి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంతో విసిగిపోయిన బాధితులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు.

బ్యాంక్ లకు భారీ కుచ్చుటోపి?
వివిద బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి మంత్రి డెవలపర్స్ కొన్ని ఆస్తుల పత్రాలు ఇచ్చి సుమారు రూ. 5,000 కోట్లకు పైగా అక్రమంగా రుణాలు తీసుకుందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. బెంగళూరులో సుమారు 7 నుంచి 10 సంవత్సరాలు అయినా ప్రజలకు ఫ్లాట్లు ఇవ్వకుండా మోసం చేశారని, ఐటీ అధికారులకు పన్ను ఎగవేశారని సుశీల్ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అరెస్టు చేసిన ఈడీ అధికారులు
మంత్రి డెవలపర్స్ అవకతవకలు, అక్రమ లావాదేవీల విషయంపై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు సుశీల్ మంత్రిని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఎంత ప్రశ్నించి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకోవాలని చూసిన సుశీల్ మంత్రిని జూన్ 25వ తేదీన అరెస్టు చేశారు. సుశీల్ మంత్రిని ఈడీ న్యాయాలయం ముందు హాజరుపరిచి విచారణ చేస్తున్నామని అప్పట్లో ఈడీ అధికారులు చెప్పారు.

తండ్రీ, కొడుకును అరెస్టు చేసిన సీఐడీ
మంత్రి డెవలపర్స్ ఎండీ సుశీల్ మంత్రి, ఆయన కుమారుడు ప్రతీక్ మంత్రిని సీఐడీ అధికారులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్టు చెయ్యడం, బెయిల మీద బయటకు రావడం తెలిసిందే. అయితే ధనంజయ పధ్మనాభ అనే వ్యక్తి పెట్టిన కేసులో సుశీల్ మంత్రి, ఆయన కుమారుడు ప్రతీక్ మంత్రిని అరెస్టు చేశామని సీఐడీ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications