బీజేపీ, భజరంగ్ దళ్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్, మీకు ఫ్రీగా ఇస్తాము రండి అంటూ!
బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు హామీ పథకాలను ప్రకటించింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం వాటిని అమలు చేస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ, భజరంగ్ దళ్ సంస్థలకు కావాలంటే మేము యువనిధి పథకం కింద డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా చెప్పింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని ఉల్లంఘించే భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హిందూ మతం కోసం పనిచేస్తున్న భజరంగ్‌దళ్‌ను పీఎఫ్‌ఐ లాంటి సంస్థతో పోల్చలేమని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వచ్చి అనుకున్న విధంగా అధికారాన్ని దక్కించుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పథకాలను కూడా నేరవేరుస్తామని ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ, భజరంగ్‌దళ్‌ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కూడా కావాలంటే హామీ పథకాల్లో భాగండా అన్ని పథకాలు అందిస్తామని అవహేళన చేశారు.
బీజేపీ నాయకులు, హిందూ కార్యకర్తలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మేము బజరంగీ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై భజరంగ్ దళ్ నాయకులు విమర్శలు గుప్పించారు. పీఎఫ్‌ఐ, ట్రిపుల్ తలాక్‌ను బీజేపీ నిషేధించింది. కాంగ్రెస్‌కు బలం, మీకు అంత సంతా ఉంటే బజరంగ్‌దళ్‌పై నిషేధం విధించాలని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ తో సహా పలువురు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ చేశారు.

బజరంగ్ దళ్ దేశానికి సేవ చేస్తున్న ఒక సంస్థ అని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగం అని బీజేపీ నాయకులు అంటున్నారు. కానీ దళ్, పీఎఫ్‌ఐ సంస్థ దేశద్రోహం చేసిందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మండిపడుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ నిషేధిస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముందు వాళ్లు ఇచ్చిన హామీల పథకాలకు అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బజరంగ్ దళ్ నిరుద్యోగులకు యువనిధి నుంచి ప్రతి నెల రూ. 3, 000 అందజేస్తామని, కానీ బజరంగ్ దళ్ నుంచి పట్టభద్రులు ఉంటేనే యువనిధి పథకం వర్తిస్తుందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్‌లో కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ నళిన్ కుమార్ కటీల్‌ను ట్యాగ్ చేస్తూ మీ ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ పేరును ప్రస్తావిస్తూ మీ ఇంటి ఉచితంగా విద్యుత్ ఇస్తామని, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కి ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని, మాజీ మంత్రి సిటీ రవికి ట్యాగ్ చేసి మీ కుటుంబానికి రూ, 2, 000 ఉచితం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యంగంగా ప్రచారం చేస్తున్నారు.
-
శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications