Daughter: అర్దరాత్రి బాయ్ ఫ్రెండ్, అతని ఫ్రెండ్స్ ను పిలిపించి తండ్రిని చంపించిన కాలేజ్ అమ్మాయి!
బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్య, ఇద్దరు కూతుర్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. పెద్ద కూతురు ఇంటర్, రెండో అమ్మాయి స్కూల్ లో చదువుతున్నారు. భార్య పని మీద సొంత ఊరికి వెళ్లింది. ఇంట్లో ఇద్దరు కూతుర్లతో కలిసి తండ్రి ఉన్నాడు. అర్దరాత్రి నలుగురు వ్యక్తులు అతని ఇంటికి వెళ్లారు. తరువాత నలుగురు యువకులు కత్తులు, రాడ్లు తీసుకుని తండ్రి మీద దాడి చేశారు. బాధితుడు కేకలు వెయ్యడంతో చిన్న కూతురు నిద్రలేచి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి బాధితుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. పెద్ద కూతురి ఆమె బాయ్ ఫ్రెండ్, అతని ఫ్రెండ్స్ ఆమె తండ్రిని హత్య చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.
Wife:
వైఫ్
ఫర్
సేల్,
వదిన
స్కెచ్,
పక్కాగా
పాటించిన
మరిది,
పక్కింటోడి
భార్యను
కొనుక్కుని
ఫ్రెండ్స్!

బెంగళూరులో నివాసం
ఐటీ హబ్ బెంగళూరులోని యలహంక న్యూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్టూరు లేఔట్ లో రాజేష్, విజయ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రాజేష్, విజయ దంపతులకు ఇంటర్ చదువుతున్న అమ్మాయి, స్కూల్ లో చదువుకుంటున్న 11 ఏళ్ల అమ్మాయి ఉన్నారు.

సంతోషంగా ఉన్నారని సమాచారం
రాజేష్, విజయ దంపతులు వారి ఇద్దరి కుమార్తెలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారని చుట్టుపక్కల వారు అనుకుంటున్నారు. రాజేష్, విజయ దంపతుల పెద్ద కుమార్తె యలహంక సమీపంలోని ఓ కాలేజ్ లో ఇంటర్ చదువుకుంటున్నది. ప్రతిరోజూ ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. చిన్న కూతురు కూడా ఇప్పుడు స్కూల్ కు వెలుతోంది.

అర్దరాత్రి ఇంట్లోకి వెళ్లి
రాజేష్ భార్య విజయ సొంత ఊరు కర్ణాటకలోని కలబురిగి. సొంతఊర్ల పని ఉండటంతో విజయ ఒక్కటే ఊరికి వెళ్లింది. ఇంట్లో ఇద్దరు కూతుర్లతో కలిసి తండ్రి రాజేష్ ఉన్నాడు. అర్దరాత్రి 12.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు రాజేష్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రాజేష్ పెద్ద కూతురు సౌండ్ రాకుండా ఇంటి తలుపులు తీసింది. రాజేష్ చిన్న కూతురు ఓ రూమ్ లో నిద్రపోయింది.

దారుణంగా చంపేసి ఎస్కేప్ అయిన బాయ్ ఫ్రెండ్
ఇంట్లోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు కత్తులు, రాడ్లు తీసుకుని కాలేజ్ అమ్మాయి తండ్రి రాజేష్ మీద దాడి చేశారు. బాధితుడు రాజేష్ గట్టిగా కేకలు వెయ్యడంతో అతని చిన్న కూతురు నిద్రలేచి గట్టిగా కేకలు వేసింది. రాజేష్ ఇంటి పక్కన ఉన్న స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రాజేష్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

నా తండ్రిని అందుకే చంపించాను
పోలీసుల విచారణలో రాజేష్ ను అతని పెద్ద కూతురు స్నేహితులు చంపేశారని వెలుగు చూసింది. రాజేష్ ఇంటి తలుపులు అతని పెద్ద కుమార్తె తీసిందని పోలీసులు అన్నారు. తన మీద తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ప్రతిరోజు అతని లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో తన బాయ్ ఫ్రెండ్, అతని స్నేహితులకు చెప్పి తన తండ్రిని చంపించానని ఇంటర్ అమ్మాయి నేరం అంగీకరించిందని యలహంక న్యూటౌన్ పోలీసులు అంటున్నారు.
తన భర్త తన కూతురిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని రాజేష్ భార్య కూడా చెబుతోందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.