విచారణ జరుగుతోంది, మ్యాటర్ మొత్తం బయటకు వస్తోంది, వెయిట్ చెయ్యండి, డీకే!
బెంగళూరు: బీబీఎంపీ ప్రధాన కార్యాలయం ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. బీబీఎంపీ కార్యాలయ ఆవరణలోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ల్యాబ్, కార్యాలయ భవనంలో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ పరిశీలించారు.
ఈ విషయమై మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. అగ్నిప్రమాదం సంభవించిన క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీ ఉండవలసిన ప్రదేశం ఇది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఇదే విషయాన్ని గమనించారని డీకే శివకుమార్ అన్నారు. అటువంటి ప్రయోగశాలను సురక్షితమైన స్థలంలో ఉంచాలని, అందుకని క్వాలిటిల్ ల్యాబ్ ను షిఫ్ట్ చేస్తామని డీకే. శివకుమార్ అన్నారు.

అగ్నిప్రమాదం సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారని, ఈ ఘటనపై బీబీఎంపీ అధికారులు, పోలీసులతో సహా మూడు బృందాలు వేర్వేరుగా విచారణ చేపట్టన్నారని, ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించిందని, క్షతగాత్రులను ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.

బాధితులు త్వరగా కోలుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, అదృష్టవశాత్తూ ఎవరి కంటి చూపు కూడా దెబ్బతినలేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. చీఫ్ ఇంజనీర్లుగా ఉంటూ గాయపడిన వారకి ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులే అని. వారికి ఇలా జరగడం విచాకరం అని డీకే శివకుమార్ అన్నాు. ఈ ఘటనకు నేను ఎవరినీ నిందించను. విచారణ పూర్తయ్యే వరకు ఈ సంఘటన గురించి ప్రకటనలు చేయబోనని డీకే శివకుమార్ చెప్పారు.
ನಾನು ಹಾಗೂ @Siddaramaiah ಅವರು ಇಂದು ವಿಕ್ಟೋರಿಯಾ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಬಿಬಿಎಂಪಿಯ ಗುಣ ನಿಯಂತ್ರಣ ವಿಭಾಗದ ಪ್ರಯೋಗಾಲಯ ಮತ್ತು ಕಚೇರಿ ಕಟ್ಟಡದಲ್ಲಿ ಸಂಭವಿಸಿದ ಅಗ್ನಿ ಅವಘಡದಲ್ಲಿ ಗಾಯಗೊಂಡಿರುವ ಸಿಬ್ಬಂದಿಯ ಯೋಗಕ್ಷೇಮ ವಿಚಾರಿಸಿದೆ. ಎಲ್ಲರನ್ನೂ ಟ್ರಾಮಾ ಸೆಂಟರ್ ಗೆ ಶಿಫ್ಟ್ ಮಾಡಿ ಉತ್ತಮ ಚಿಕಿತ್ಸೆ ನೀಡಲು ತಿಳಿಸಲಾಗಿದೆ. ಘಟನೆ ಬಗ್ಗೆ… pic.twitter.com/cjRgUxgmzH
— DK Shivakumar (@DKShivakumar) August 11, 2023
ప్రత్యర్థి పార్టీ నేతల ఆోపణలప మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానమిస్తూ వారిని ఎంత మాట్లాడితే అంత మాట్లాడనివ్వండి, తరువాత సమాధానం చెబుతామని అన్నారు. బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలోని క్వాలిటి సెల్ విభాగంలోని కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురికి గాయాలైనాయి.
బీబీఎంపీ కార్యాలయ ఆవరణలోని క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన లేబొరేటరీ, కార్యాలయ భవనంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై లోతుగా విచాణ జరుగుతోంది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగిన పత్రాలు ఇదే కార్యాలయంలో ఉన్నాయని అధికారులు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications