Family: తల్లీ ,బిడ్డలు, అన్న కొడుకు, అందర్ని నరికేశారు. వారం క్రితం వ్యాపారం కోసం వెళ్లిన భర్త, ప్లాన్!

బెంగళూరు/మండ్య: బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్న భార్యతో చక్కగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతులతో పాటు భార్య అన్న, వదిన కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. బావబావమరిది కలిసి వ్యాపారం చేస్తున్నారు. వారం రోజులు ఇంటి దగ్గర ఉంటే 15 రోజులు బయట వ్యాపారం చేస్తున్న బావబావరిది తరువాత ఇంటికి చేరుకుని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ వ్యాపారానికి వెలుతున్నారు.

కొన్ని రోజుల క్రితం భర్త, అతని భార్య అన్న, వదిన కలిసి వ్యాపారం చెయ్యడానికి బయట ఊర్లకు వెళ్లారు. ఇంట్లో మహిళ ఆమె ముగ్గురు పిల్లలు, అన్న కొడకుతో ఉంది. మరుసటి రోజు ఉదయం బంధువు అయిన మహిళ వారి ఇంటికి వెళ్లి చూడగా వివాహిత మహిళతో పాటు నలుగురు పిల్లలు ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

మహిళ, నలుగురు బిడ్డలను కత్తులు, కొడవళ్లతో దారుణంగా నరికి చంపేసిన నిందితులు ఇంటి బయట లాక్ చేసుకుని వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఒకే ఇంట్లో ఐదు మంది దారుణ హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

దంపతులకు ముగ్గురు పిల్లలు

దంపతులకు ముగ్గురు పిల్లలు

మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణం తాలుకాలోని కేఆర్ ఎస్ ఊరిలోని బజార్ లైన్ ప్రాంతంలో గంగారామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బంధువుల అమ్మాయి లక్ష్మీ (31)ని వివాహం చేసుకున్న గంగరామ్ అతని భార్యతో చక్కగా కాపురం చేస్తున్నాడు. గంగరామ్, లక్ష్మీ దంపతులకు , రాజ్ (12), కోమల్ (7), కునాల్ (4) అనే నలుగురు పిల్లలు ఉన్నారు.

ఉమ్మడి కుటుంబం

ఉమ్మడి కుటుంబం

గంగారామ్ భార్య లక్ష్మీ అన్న గణేస్, అతని భార్య చంపాణి కూడా ఒకే ఇంటిలో ఉంటున్నాడు. గంగారమ్, లక్ష్మీ దంపతులతో పాటు గణేష్, చంపాడి దంపతులు అందరూ కలిసి ఉమ్మడి కాపురం ఉంటున్నారు. గణేష్, చంపాడి దంపతులకు గోవింద (8) అనే కుమారుడు ఉన్నాడు. గంగారామ్, అతని భార్య అన్న గణేష్ వాళ్ల భార్యలు ఇంతకాలం చాలా సంతోషంగా ఉండేవారు.

వ్యాపారం కోసం వెళ్లిన భర్త

వ్యాపారం కోసం వెళ్లిన భర్త

బావబావమరిది గంగారామ్, గణేష్ కలిసి ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. వారం రోజులు ఇంటి దగ్గర ఉంటే 15 రోజులు బయట వ్యాపారం చేస్తున్న బావబావరిది బంగారామ్, గణేష్ తరువాత ఇంటికి చేరుకుని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ వ్యాపారానికి వెలుతున్నారు.

వారం రోజుల క్రితం

వారం రోజుల క్రితం

కొన్ని రోజుల క్రితం లక్ష్మీ భర్త గంగారామ్, అతని భార్య వదిన చంపాడి, అన్న గణేష్ కలిసి వ్యాపారం చెయ్యడానికి బయట ఊర్లకు వెళ్లారు. తరువాత లక్ష్మీ ఆమె ముగ్గురు పిల్లలతో పాటు అన్న గణేష్ కొడుకు గోవిందతో కలిసి ఇంటిలో ఉంటున్నది. రాత్రి పిల్లలతో కలిసి బయట కనపడిన లక్ష్మీ తరువాత ఇంట్లోకి వెళ్లి భోజనం చేసి నిద్రపోయారని తెలిసింది.

ఐదు మందిని ఒకేసారి నరికేశారు

ఐదు మందిని ఒకేసారి నరికేశారు

ఉదయం లక్ష్మీ బంధువు వెళ్లి ఆమెను పిలిచింది. లక్ష్మీ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి బయట తలుపు లాక్ తీసి లోపలికి వెళ్లింది. వివాహిత మహిళ లక్ష్మీతో పాటు ఇంట్లో ఉన్న నలుగురు పిల్లలు రాజు, కోమల్, కునాల్, గోవింద దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. లక్ష్మీతో పాటు నలుగురు బిడ్డలను కత్తులు, కొడవళ్లతో దారుణంగా నరికి చంపేసిన నిందితులు ఇంటి బయట లాక్ చేసుకుని వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ఎందుకు చంపారు అనే విషయంలో?

ఎందుకు చంపారు అనే విషయంలో?

ఒకే ఇంట్లో ఐదు మంది దారుణ హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న దక్షిణ విభాగం ఐజీపీ ప్రవీణ్ మధుకర్ పవార్, మండ్య జిల్లా ఎస్పీ ఎన్, యతీష్ సంఘటనా స్తలానికి చేరుకుని పరిశీలించారు. ఒకే ఇంట్లో ఐదు మందిని ఎందుకు హత్య చేశారు ? అనే విషయంపై కచ్చితంగా క్లారిటీ లేదని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+