బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Family: మాజీ సైనికుడు, రిజర్వేషన్ తో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం, డీసీపీ ఆఫీసు పక్కనే ఆత్మహత్య, జోబులో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారత సైన్యంలో కొంతకాలం ఉద్యోగం చేసిన యువకుడు తరువాత పదవి విరమణ చేశాడు. సొంత ఊరు చేరుకున్న మాజీ సైనికుడు కొంతకాలం భార్య, పిల్లలతో సంతోషంగా గడిపాడు. ఎక్స్ సర్వీస్ రిజర్వేషన్ లో భాగంగా అతను పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు సంతోషంగానే ఉద్యోగానికి వెళ్లి వస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాటి ఉద్యోగులతో బాగానే మాట్లాడుతున్నాడు.

సాయంత్రం ఉద్యోగానికి వెళ్లిన అతను రాత్రి నైట్ డ్యూటీలో ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం డీసీపీ కార్యాలయం పక్కన హెడ్ కానిస్టేబుల్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాటి ఉద్యోగులు విషయం గుర్తించి హడలిపోయారు. ఆత్మహత్య చేసుకునే ముందు హెడ్ కానిస్టేబుల్ డెత్ నోట్ రాసి అతని ప్యాంట్ జోబులో పెట్టుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

Second wife: కోటీశ్వరుడు, భార్యకు బెల్లం బర్ఫీ, ఉంచుకున్నదానికి వడ్డానం, రియల్ వ్యాపారి ఫినిష్!Second wife: కోటీశ్వరుడు, భార్యకు బెల్లం బర్ఫీ, ఉంచుకున్నదానికి వడ్డానం, రియల్ వ్యాపారి ఫినిష్!

మాజీ సైనికుడు

మాజీ సైనికుడు

బెంగళూరుకు చెందిన కుమార్ (38) అనే యువకుడు చాలా సంవత్సరాల క్రితం భారత సైన్యంలో చేరాడు. భారత సైన్యంలో కొంతకాలం ఉద్యోగం చేసిన కుమార్ తరువాత పదవి విరమణ చేశాడు. సొంత ఊరు బెంగళూరు చేరుకున్న మాజీ సైనికుడు కుమార్ అతని భార్య, పిల్లలతో సంతోషంగా గడిపాడు.

హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం

హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం

మాజీ సైనికుడు అయిన కుమార్ తరువాత మరో ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నించాడు. సీఆర్ పీఎఫ్ లో ఎక్స్ సర్వీస్ రిజర్వేషన్ లో భాగంగా కుమార్ పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం సీఆర్ పీఎఫ్ లో కుమార్ హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరు పశ్చిమ విభాగం సీఏఆర్ విభాగంలోని డీసీపీ కార్యాలయం దగ్గర కుమార్ విధుల్లో ఉన్నాడు.

చెట్టుకు ఉరి వేసుకున్న హెడ్ కానిస్టేబుల్

చెట్టుకు ఉరి వేసుకున్న హెడ్ కానిస్టేబుల్

ప్రతిరోజు సంతోషంగానే ఉద్యోగానికి వెళ్లి వస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుమార్ సాటి ఉద్యోగులతో బాగానే మాట్లాడుతున్నాడు. సాయంత్రం జ్ఞానభారతి సమీపంలోని సీఏఆర్ క్యాంపస్ దగ్గర ఉద్యోగానికి వెళ్లాడు. కుమార్ రాత్రి నైట్ డ్యూటీలో ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం డీసీపీ కార్యాలయం పక్కన హెడ్ కానిస్టేబుల్ కుమార్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాటి ఉద్యోగులు కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి హడలిపోయి పై అధికారులకు సమాచారం ఇచ్చారు.

డెత్ నోట్ రాసి పెట్టిన హెడ్ కానిస్టేబుల్

డెత్ నోట్ రాసి పెట్టిన హెడ్ కానిస్టేబుల్

కుమార్ ఆత్మహత్య చేసుకునే ముందు అతను ఓ డెత్ నోట్ రాసిపెట్టాడు. తాను అవసరాల కోసం అప్పులు చేశానని, రుణం ఇచ్చిన వారు తీసుకున్న డబ్బు వెంటనే చెల్లించాలని తనను టార్చర్ పెట్టారని, సరైన సమయంలో అప్పులు తీర్చలేకపోయి ఆవేదన చెందానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని కుమార్ డెత్ నోట్ లో రాసిపెట్టాడని జ్ఞానభారతి పోలీసులు చెప్పారు.

అప్పుల బాధలా ? లేక ఏమైనా

అప్పుల బాధలా ? లేక ఏమైనా

అప్పులు కారణంగానే కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా ?, లేక చెప్పుకోలేని పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే వియం కచ్చితంగా తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరులోని దుబాసిపాళ్య సమీపంలో కుమార్ అతని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.

ఎవరెవరు ఫోన్లు చేశారు?

ఎవరెవరు ఫోన్లు చేశారు?

కుమార్ ఆత్మహత్య చేసుకునే రెండు మూడు రోజుల నుంచి అతనికి అప్పులు ఇచ్చిన వారు ఎవరైనా బెదిరించారా ? అనే కోణంలో పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తన్నారు. హెడ్ కానిస్టేబుల్ కుమార్ మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేస్తున్నామని బెంగళూరులోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ అధికారులు అంటున్నారు.

English summary
Family: Head Constable committed suicide in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X