బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Gunshots: తుపాకీలతో కాల్పులు జరిపి కేంద్ర మంత్రికి స్వాగతం, మోదీ ఏదో చెబితే ఇలా చేస్తే ?, భగవంతుడా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బీదర్/ హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ నాయకులు దేశంలోని 19 రాష్ట్రాల్లో జనాశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు. 150 లోక్ సభ నియోజక వర్గాల్లో జనాశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్ బీజేపీ కేంద్ర మంత్రి జనాశీర్వాద యాత్రలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో చోటు సంపాధించుకుని కేంద్ర మంత్రి అయిన లీడర్ కు కొందరు నాయకులు, కార్యకర్తల అత్సుత్సాహం వలన ఇబ్బందుల్లో పడ్డారు. హైదరాబాద్ నుంచి సొంత నియోజక వర్గానికి చేరుకున్న కేంద్ర మంత్రి, పక్క నియోజక వర్గంలోకి వెళ్లిన వెంటనే ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి దృష్టిలో పడాలని గాల్లోకి ఢిష్యూం.... ఢిష్యూం అంటూ తుపాకితో కాల్పులు జరిపారు. స్పాట్ లో కేంద్ర మంత్రి ఉండటంతో మొదట పోలీసులు సైతం ఏమీ చెయ్యలేక సైలెంట్ గా ఉండిపోయారు. తరువాత గాల్లోకి నాటు తుపాకితో కాల్పులు జరిపారని తెలుసుకున్న పోలీసులు నాలుక కరుచుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తుల మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు విచారణ మొదలు పెట్టారు. కేంద్ర మంత్రి దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నించిన నాయకులు ఇప్పుడు అదే కేంద్ర మంత్రిని ఇబ్బందులకు గురి చేసి వారు ఇబ్బందుల్లో పడ్డారు.

Illegal affair: ప్రియుడే జీవితం, హోటల్ ఫుడ్ ఉంటే ఇంట్లో ఫుడ్ ఎందుకు ?, భార్య ప్లాన్ 100% రివర్స్ !Illegal affair: ప్రియుడే జీవితం, హోటల్ ఫుడ్ ఉంటే ఇంట్లో ఫుడ్ ఎందుకు ?, భార్య ప్లాన్ 100% రివర్స్ !

 ఎవ్వరూ ఊహించలేదు.....కేంద్ర మంత్రి అయిపోయారు

ఎవ్వరూ ఊహించలేదు.....కేంద్ర మంత్రి అయిపోయారు

కర్ణాటకలోని బీదర్ లోక్ సభ నియోజక వర్గం (తెలంగాణ సరిహద్దు) ఎంపీ భగవంత ఖూబా ఇటీవల కేంద్ర మంత్రి అయిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ గత జులై నెలలో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఎవ్వరూ ఊహించని విధంగా బీదర్ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ భగవంతా ఖూబా మంత్రి పదవి దక్కించుకుని కర్ణాటకలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు.

కేంద్ర మంత్రికి గ్యాండ్ వెల్ కమ్


ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో చోటు సంపాధించుకుని కేంద్ర మంత్రి అయిన భగవంత్ ఖూబా సొంత నియోజక వర్గంతో పాటు పక్కన ఉన్న జిల్లాల్లో పర్యటించడానికి సిద్దం అయ్యారు. కేంద్ర మంత్రి భగవంత ఖూబాకు పోటాపోటీగా స్వాగతం పలకడానికి పోటీ పడిన బీజేపీ లీడర్లు, కొందరు నాయకులు, కార్యకర్తల అత్సుత్సాహం వలన అందరూ ఇబ్బందుల్లో పడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో యాత్ర

ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో యాత్ర

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ నాయకులు దేశంలోని 19 రాష్ట్రాల్లో జనాశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు. 150 లోక్ సభ నియోజక వర్గాల్లో జనాశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్ బీజేపీ కేంద్ర మంత్రి జనాశీర్వాద యాత్రలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో కేంద్ర మంత్రులు ఇప్పుడు జనాశీర్వాద యాత్రల్లో పాల్గొంటున్నారు.

 తుపాకితో ఢిష్యూం.... ఢిష్యూం అంటూ కాల్చేశారు

తుపాకితో ఢిష్యూం.... ఢిష్యూం అంటూ కాల్చేశారు

హైదరాబాద్ నుంచి సొంత నియోజక వర్గానికి చేరుకున్న కేంద్ర మంత్రి భగవంత ఖూబాకు ఘనంగా స్వాగతం పలకడానికి బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేశారు. కర్ణాటకోని యాదగిరి జిల్లా ముద్కాళ గ్రామం సమీపంలోకి కేంద్ర మంత్రి భగవంతా ఖూబా చేరుకోగానే ఆయన దృష్టిలో పడాలని కొందరు బీజేపీ కార్యకర్తలు గాల్లోకి ఢిష్యూం.... ఢిష్యూం అంటూ తుపాకితో కాల్పులు జరిపారు.

ఇబ్బందుల్లో పొలిటికల్ లీడర్స్

ఇబ్బందుల్లో పొలిటికల్ లీడర్స్

తుపాకితో కాల్పులు జరిపిన సమయంలో స్పాట్ లో కేంద్ర మంత్రి భగవంత ఖూబా కూడా ఉండటంతో మొదట పోలీసులు సైతం ఏమీ చెయ్యలేక సైలెంట్ గా ఉండిపోయారు. తరువాత గాల్లోకి నాటు తుపాకితో కాల్పులు జరిపారని తెలుసుకున్న యాదగిరి జిల్లా పోలీసులు నాలుక కరుచుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తుల మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు విచారణ మొదలు పెట్టారు. కేంద్ర మంత్రి భగవంతా ఖూబా దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నించిన నాయకులు ఇప్పుడు అదే కేంద్ర మంత్రిని ఇబ్బందులకు గురి చేసి వారు ఇబ్బందుల్లో పడ్డారు.

కోవిడ్ రూల్స్ బ్రేక్

కోవిడ్ రూల్స్ బ్రేక్

కేంద్ర మంత్రి భగవంత ఖూబాతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజు గౌడ తదితరులు కాల్పులు జరిపిన ప్రదేశంలోనే ఉన్నారని కన్నడ మీడియా తెలిపింది. కేంద్ర మంత్రి భగవంత ఖూబా రాక సందర్బంగా ఎర్పాటు చేసిన గ్రాండ్ వెల్ కమ్ ఏర్పాట్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముఖానికి మాస్కలు వేసుకోలేదని, కోవిడ్ నియమాలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Gunshots: Union minister of fertilizers and chemicals bhagwanth khuba welcomed with celebratory gunshots during his visit to Yadgir district of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X